Merry Chirstmas 2023 :  మానవాళికి దేవుడిచ్చిన బహుమానమే యేసుక్రీస్తు!  క్రీస్తు జననంతో క్రీస్తుశకం ఆరంభమైంది. అంతకు ముందు కాలాన్ని క్రీస్తుకు పూర్వం అంటారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్‌ పర్వదినంగా  జరుపుకుంటారు. ప్రపంచమంతటా ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. బాలయేసు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో దినదిన ప్రవర్ధమానంగా ఎదిగుతూ జ్ఞానాన్ని పంచాడు. బాలక్రీస్తు ప్రబోధలు వింటూ అందరూ అబ్బురపడ్డారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించాలి.. అప్పుడే మానవాళికి పరలోక ప్రాప్తి కలుగుతుందన్నదే క్రీస్తు ప్రబోధామృతం.ఎంత పాప కార్యాలు చేసినా వాటిని గ్రహించి పశ్చాత్తాపం చెందితే యేసుక్రీస్తు క్షమిస్తాడు. అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువు. చెడును విడిచిపెట్టినపుడు మాత్రమే క్రీస్తు మనలోనే నివసిస్తాడు. హృదయకవాటం వద్ద ప్రభువు నిలబడి ఉన్నాడు...అది గుర్తించినప్పుడు మాత్రమే దైవ సాక్షాత్కారం లభిస్తుంది. ముఖ్యంగా క్రీస్తు ఆజ్ఞను శిరసాహవహించాలి.


Also Read: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!


దానం ప్రధానం
ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన తమ ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీ, నక్షత్రాలతో అలంకరిస్తారు. ఈ క్రిస్మస్ వేడుకలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. అయితే క్రిస్మస్ పండుగ సమయంలో దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిస్వార్థంగా ఎవరైతే దేవునికి సేవ చేస్తారో వారికి ఏసుక్రీస్తు ఆశీస్సులు లభిస్తాయి. మీరు చేసే దానం ఇతరులు చూడాలని కానీ ఇతరులు మెచ్చుకోవాలని కానీ ఉండకూడదు. ఇతరులకు తెలిసే విధంగా అస్సలు దానం చేయకూడదు. అలా చేసిన దానం మీకు ఫలితాన్నివ్వదు. దానం చేస్తున్నప్పుడు ఎవ్వరి నుంచి ప్రశంసలు కోరుకూకూడదు. నువ్వు చేసే దానం నీ అంతరాత్మకు తెలిస్తే చాలు. అంటే నీ కుడిచేయి దానం చేస్తోంది. ఆ సంగతి ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అప్పుడే నీ హృదయంలో ఉన్న దేవుడు నీకు ఫలితాలను అందజేస్తాడు. ప్రార్థన  కోసం చర్చిలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నువ్వున్న ప్రదేశంలోనే నిశ్చలభక్తితో ప్రభువును ప్రార్థిస్తే చాలు.  


Also Read: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!


శాంటాగా మారి దానం చేయండి
శాంటా అంటే భగవంతుడి స్వరూపంగా భావిస్తారంతా. పైగా చేసేదానం భగవంతుడికే చెందాలి మీకు కాదు.  అందుకే శాంటాగా మారి సంతోషంగా దానం చేయండి. ఈ పవిత్రమైన రోజు పేదలకు, నిస్సహాయులకు మీ సామర్థ్యం మేరకు వస్త్రాలు, ఆహారం, ఆర్థిక పరంగా మీకు తోచిన సహాయం చేయండి. చాలామంది శాంతాక్లాజ్ వేషధారణలో ఎవరికీ తెలియకుండా హెల్ప్ చేస్తుంటారు.  రాత్రి వేళలో  ఫుట్ పాత్ లపై నివసించే వారికి బహుమతులు అందజేస్తారు. రహస్య దానం మీ మనసుకి ఆనందాన్నిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసేదానం మీరు ఊహించనంత మంచి ఫలం ఇస్తుంది


Also Read: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!


ఏసు సందేశం ఇదే!
ప్రతి మానవుడు వినయం, స్వచ్ఛత, శాంతి, ప్రేమ, సద్భావన, క్షమాపణ, రహస్య దానాలను స్వీకరించాలి. తాము సంపాదించిన సంపదలో కనీసం కొంత భాగం పేదలకు పంచాలని, దాని వల్ల ఎంతో సంతోషం లభిస్తుందని.. అది వెలకట్టలేనిదిగా ఉంటుందన్నదే ఏసు సందేశం..



Also Read: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!