Christmas Santa Claus:  క్రిస్మస్ అంటే చిన్నారులకు భలే ఇష్టం.కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏం ఇష్టమో వాటిని ఈ పండుగ రోజు బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. క్రిస్మస్ తాత ‘శాంటాక్లాజ్’వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్లాడని పిల్లలకి చెబుతారు. క్రిస్మస్ కి బహుమతులు ఇచ్చే ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది? ఈ బహుమతులు ఇవ్వడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? 


విదేశాల్లో మొదలైన ట్రెండ్
క్రిస్మస్ సందర్భంగా బహుమతులను ఇవ్వడం అనేది విదేశాల్లో  మొదలైన ట్రెండ్. క్రిస్మస్ కి ముందే పిల్లలు తమకు కావాల్సిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో ఏదో ఒకటి పిల్లలకు ఇస్తుంటారు. పిల్లలు మాత్రం ఆ గిఫ్టులు క్రిస్మస్ తాత ఇచ్చాడని సంబరపడిపోతారు. 


Also Read: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!


క్రిస్మస్ తాత ఎలా పుట్టాడో తెలుసా!
ఓ ధనికుడైన వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయటకు వెళ్లేవాడు. అలా వెళుతున్న సమయంలో వీధిలో రోడ్డు పక్కన సరైన దుస్తులు కూడా లేకుండా ఆకలితో అలమటించి పోతున్న ఓ కుటుంబాన్ని చూసి చలించిపోయాడు. వారికి సహాయం చేయాలని భావించిన ఆ ధనికుడు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సీక్రెట్ గా వెళ్లి దుప్పట్లు, కొంత డబ్బుతో పాటూ పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు కూడా అక్కడ పెట్టేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో  ఆయన తలకు టోపి, కోటు  ధరించి చేతిలో కర్రతో ఉన్నట్టు గమనించారు అక్కడున్నవారు. ఆ రోజు క్రిస్మస్ కావడంతో దేవుడే  క్రిస్మస్ తాతను పంపించాడని విశ్వసించడం మొదలెట్టారు. అప్పటి నుంచీ క్రిస్మస్ సమయంలో పేదలకు సహాయం చేయడం, పిల్లలకు బహుమతులు ఇవ్వడం మొదలైందని చెబుతారు.


Also Read: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!


మరో కథ ఇది
క్రిస్మస్ తాత గురించి ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటంటే.. 13 వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేని దుస్థితిలో ఉన్నాడు. ఆ సమస్య గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటిమీదున్న పొగగొట్టంలోంచి 3 బంగారు నాణాలున్న సంచులు జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి  పొయ్యిపక్కనే ఆరేసిన మేజోళ్ళు (సాక్సులు) లో పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగువారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. అందుకే క్రిస్మస్ వేడుకలలో సాక్సులు కూడా ప్రత్యేకం అయ్యాయి. దీంతో బీదవారంతా తమకు ఎంతో కొంత సాయం అందుతుందని ఎదురుచూడడం మొదలుపెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు శాంటాక్లాజ్ రూపంలో తమ ప్రాంతంలో నిరుపేదలకు సహాయం చేయడం మొదలుపెట్టారు.


Also Read: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!


శాంటా రూపం ఇదేనా!
1822 లౌ క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి "యాన్ ఎకౌంట్ ఒఫ్ ఎ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్" అనే పోయెమ్ రాశారు. ఇది "ఇట్ వజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్" అనే పేరుతో బాగా పాపులర్ అయింది.  ప్రస్తుతం శాంటా క్లాజ్ అంటే ఎలా ఉంటాడని అనుకుంటున్నామో అలా వర్ణించింది ఈయనే. ఎనిమిది రెయిన్ డీర్లు లాగుతున్న ఒక స్లే మీద ఎక్కి ఒక ఇంటి నుంచి మరో ఇంటి మీదకు ఎగురుతూ వెళ్లి పిల్లలకి  బహుమతులు ఇస్తాడని పోయెంలో వర్ణించారు.


Also Read: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!


అయితే క్రిస్మస్ ని ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చూస్తే అందరూ జరుపుకోవచ్చు. మీరు కూడా శాంటాలా మారి బహుమతులు అందివ్వొచ్చు...