Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఓటు అప్పీల్ చేసుకోవడానికి టాస్కుల్లో కష్టపడుతున్నారు హౌజ్‌మేట్స్, ఫినాలే అస్త్రా, ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ల కోసం హౌజ్‌మేట్స్ ఎలాగైతే బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడారో.. ఇక ఓటు అప్పీల్ కోసం అలాగే టాస్కులు ఆడుతూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రసారమయిన ఎపిసోడ్‌లో నాలుగు టాస్కులు పూర్తి అవ్వగా శోభా ఓటు అప్పీల్ చేసుకుంది. అమర్‌, అర్జున్‌లలో ఎవరు ఓటు అప్పీల్ చేసుకుంటారో గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో తెలియనుంది. అంతే కాకుండా హౌజ్‌మేట్స్ అంతా నేడు మరిన్ని టాస్కులలో పాల్గొనగా.. ఆ సమయంలో అమర్, ప్రశాంత్‌లపై తీవ్ర వాగ్వాదం జరిగింది. మిగతా హౌజ్‌మేట్స్ అంతా చూస్తూ కూర్చున్నా.. అర్జున్ మాత్రం గొడవను ఆపడానికి ముందుకొచ్చాడు.


యావర్‌ను టార్గెట్ చేసిన శోభా..
‘‘ఈ గేమ్ వివిధ రౌండ్స్‌లో జరుగుతుంది. అందరూ తమకు ఇచ్చిన జాకెట్స్ ధరించి.. స్టార్ట్ బజర్ మోగగానే మిగతా వారి జాకెట్స్‌పై బాల్స్ విసరాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్‌పై ఎక్కువ బాల్స్ ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి తొలగిపోతారు’’ అని టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించారు. ఇక బజర్ మోగిన వెంటనే యావర్‌ను టార్గెట్ చేసింది శోభా. మిగతావారిని వదిలేసి ఒకరిపై ఒకరు బాల్స్ విసురుకున్నారు. దీంతో ఇద్దరూ మొదటి రౌండ్‌లోనే ఔట్ అయ్యారు. యావర్‌కు కోపం వచ్చి తన జాకెట్‌ను విసిరేసి, బాల్స్‌ను తన్ని పక్కకు తప్పుకున్నాడు. తరువాతి రౌండ్ నుంచి శోభా సంచాలకురాలిగా వ్యవహరించింది.


అమర్‌ను రెచ్చగొట్టిన ప్రశాంత్..
ఆ తర్వాత జరిగిన రౌండ్‌లో ప్రశాంత్‌ను టార్గెట్ చేశాడు అమర్‌దీప్. ఇక టాస్క్ అయిపోయిన తర్వాత అమర్.. తనను కొరికాడంటూ శోభాకు చూపించాడు ప్రశాంత్. ‘‘నేను తప్పు అను ఒప్పుకుంటా. కనిపిస్తున్నాయి. కానీ నువ్వు చేసేవి కనిపించవు తెలుసా’’ అని గొడవను మొదలుపెట్టాడు అమర్. ‘‘నువ్వు చేసేది తప్పే’’ అని వెంటనే రివర్స్ అయ్యాడు ప్రశాంత్. దీంతో అమర్‌కు ఇంకా కోపం వచ్చి చెప్పు తీసుకొని కొడతాను అన్నట్టుగా సైగ చేశాడు. అమర్‌ను కంట్రోల్ చేయడానికి శోభా ప్రయత్నించింది. ‘‘ఉంటే ఎంత, పోతే ఎంత, వీడి గురించి తెలియాలి అందరికీ’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు అమర్.


‘‘నీకు ఉన్న డబుల్ గేమ్స్ ఎవరికీ లేవు’’ అని ప్రశాంత్‌ను చూసి అన్నాడు. ‘‘నేనే అబద్ధం, వాడే నిజం’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘‘ఎలాగో అందరికీ తెలుసు’’ అని ప్రశాంత్ కూల్‌గా సమాధానమిచ్చాడు. ‘‘కట్టుకథ అల్లొద్దు. వాడేం చెప్పాడో చెప్పనని మాటిచ్చాను. అందుకే నిజం బయటపెట్టడం లేదు నేను. వాడు ఏం చెప్పాడో తెలుసా వేరేవాళ్లతో?’’ అంటూ శివాజీకి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు అమర్. ‘‘నన్ను ఒక పిచ్చోడిలా చూశాడు’’ అంటూ తలకొట్టుకున్నాడు. ‘‘కోపం చూడు. నీళ్లు తాగు’’ అంటూ సలహాలు ఇచ్చాడు ప్రశాంత్. ‘‘మాట్లాడకు. చాలా రెచ్చగొడుతున్నావు మనుషులను. రెచ్చగొట్టకురా’’ అంటూ నరాలు తెగిపోయేలా అరిచాడు. ఇదంతా చూస్తూ సహనం కోల్పోయిన అర్జున్.. ‘‘నువ్వు కూర్చో, నువ్వు ఆపు’’ అంటూ ఇద్దరిపై అరిచాడు.


Also Read: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!