Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని హౌజ్‌మేట్స్‌కు ఇచ్చిన బిగ్ బాస్.. అందులో కూడా చిన్న ట్విస్ట్‌ను పెట్టారు. ప్రతీ రెండు టాస్కుల తర్వాత ఆ టాస్కుల్లో గెలిచిన విన్నర్స్‌ను ఓటు అప్పీల్‌కు కంటెండర్స్‌గా ప్రకటిస్తారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరు ఓటు అప్పీల్ చేసుకోవాలి అనే నిర్ణయం మిగతా హౌజ్‌మేట్స్ చేతిలో ఉంటుంది. దీంతో ఎవరికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తే.. మరొకరు.. నాకెందుకు ఇవ్వలేదు అంటూ గొడవ మొదలుపెడుతున్నారు. తాజాగా అమర్‌దీప్, అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది. స్పై బ్యాచ్ అంతా అర్జున్‌కే సపోర్ట్ చేయడంతో అమర్‌దీప్‌కు కోపం వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


ఎవరికి సపోర్ట్..?
ముందుగా ప్రశాంత్ వచ్చి అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పి వెళ్లిపోయాడు. ‘‘నన్ను మాట్లాడనివ్వు’’ అని అమర్‌దీప్.. ప్రశాంత్‌ను ఆపాడు. ‘‘నేనెందుకు ఓటు అప్పీల్ చేసుకోకూడదని భావిస్తున్నావు?’’ అని అడిగాడు. ‘‘నిన్న మనకోసం కేక్ తిన్నాడు, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా’’ అని ప్రశాంత్ చెప్తుండగానే.. ‘‘నేను కూడా కేక్ తిన్నాను’’ అంటూ అమర్ గుర్తుచేశాడు. ‘‘ముసుగులో గుద్దులాట ఏం లేదు. ఒకసారి నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు నాకు చేయలేదు అని మొన్ననే అన్నావు’’ అని ప్రశాంత్ సూటిగా చెప్పేశాడు. ‘‘మరి ఇప్పటివరకు గేమ్‌లు అవన్నీ ఎందుకు అడ్డంపెట్టుకున్నావు’’ అని రివర్స్ అయ్యాడు అమర్.


నాకూ రకరకాలుగా మాట్లాడడం వచ్చు..
ఆ తర్వాత శోభా.. ‘‘ఈ 14 వారాల కష్టం దాటాలి ముందు. కాబట్టి ఈవారం వాడు నామినేషన్‌లో ఉన్నాడు’’ అని చెప్తూ అమర్‌కే సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ‘‘గతవారం లాస్ట్‌లో ఉంది నేనే కదా. ఆ రకంగా చూస్తే వాడికంటే నేను గేమ్‌లో స్ట్రాంగ్ అయినా ఓటింగ్ తక్కువే’’ అని అర్జున్ గుర్తుచేశాడు. ఇక ‘స్పై’ బ్యాచ్ లీడర్ శివాజీ మాత్రం అర్జున్‌కే సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పాడు. ‘‘తను లాస్ట్‌లో ఉన్నాడు అనేది నిజం’’ అని శివాజీ చెప్తుండగానే.. ‘‘అస్త్రా ఆయన దగ్గరే ఉంది.. నా దగ్గర లేదు’’ అని జోక్యం చేసుకున్నాడు అమర్. అయినా అమర్ చెప్పింది పట్టించుకోకుండా శివాజీ.. తన పాయింట్‌ను చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘వందలాదిసార్లు మార్చుకున్నానని చెప్పావు నువ్వే నీ నోటితో’’ అని అమర్ గేమ్‌ను తనకే గుర్తుచేశాడు. దీంతో అమర్ సీరియస్ అయ్యాడు. ‘‘ఈ డొంకతిరుగుడు, ఇద్దరు ఉన్నారు ఒకరికి చేయనా ఇదంతా ఎందుకు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దానికి శివాజీకి కోపం వచ్చింది. ‘‘నా అభిప్రాయం నేను చెప్పాను. నువ్వు దానికి నెగిటివ్‌గా, రకరకాలుగా మాట్లాడితే.. నాకూ రకరకాలుగా మాట్లాడడం వచ్చు’’ అని రివర్స్ అయ్యాడు.


అమర్, యావర్‌ల మధ్య గొడవ..
శోభా తర్వాత ప్రియాంక కూడా అమర్‌దీప్‌కే సపోర్ట్ చేసింది. ‘‘ఈవారం నామినేషన్స్ అనేది దాటడం చాలా ముఖ్యం కాబట్టి నేను అమర్‌కే ఇస్తున్నాను’’ అని చెప్పింది. ‘‘1000 శాతం వాడికంటే నాకు ఇది ముఖ్యం’’ అని అర్జున్ అన్నాడు. ఆ తర్వాత యావర్.. ‘‘అర్జున్‌కు సపోర్ట్ ఇస్తున్నా’’ అని ప్రకటించాడు. అది విన్న అమర్‌కు కోపం వచ్చింది. ‘‘నీతో మంచి అనిపించుకోవడానికి ఈ డ్రామాలన్నీ’’ అని అర్జున్‌తో చెప్పాడు. అది విని యావర్ సీరియస్ అయ్యాడు. వెళ్లు అంటూ చిరాకుగా చెప్పాడు అమర్. ‘‘ఇప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడడం లేదు. ఆయన నాతో మాట్లాడడం లేదు’’ అని అర్జున్‌తో మాట్లాడని విషయంలో క్లారిటీ ఇచ్చాడు యావర్. ‘‘నేను ఒప్పుకుంటున్నాను. కెప్టెన్‌గా నేను చెప్తున్నాను వెళ్లి వెనక నిలబడు’’ అని అమర్ అన్నాడు. ‘‘నువ్వు కెప్టెన్ కాదు’’ అని యావర్ అనగానే.. ‘‘నేను ఈ హౌజ్‌కు కెప్టెన్’’ అని అరిచాడు అమర్. అలా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది.



Also Read: హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?