Hi Nanna movie twitter review in Telugu: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'హాయ్ నాన్న' థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ఒక్క రోజు ముందు హైదరాబాద్‌లో ప్రీమియర్ షో వేశారు. అమెరికాలోనూ ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా ఎలా ఉంది?


మీరు తప్పకుండా ఏడుస్తారు!
'హాయ్ నాన్న' థియేటర్లకు వెళ్లిన జనాలు తప్పకుండా ఏడుస్తారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇదొక క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు. నాని కెరీర్ ఫిల్మోగ్రఫీ చూస్తే... 'హాయ్ నాన్న' ఓ మైల్ స్టోన్ అవుతుందని, సినిమాలో ప్రతిదీ వర్కవుట్ అయ్యిందని పేర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తారని చెప్పుకొచ్చారు.


ఓవర్సీస్ క్రిటిక్ ఒకరు 'హాయ్ నాన్న' క్లీన్ అండ్ ఎమోషనల్ మూవీ అని తెలిపారు. ఫస్టాఫ్ పాసిబుల్ అయితే... సెకండాఫ్ బావుందని చెప్పారు. టిపికల్ ఫ్లాష్ బ్యాక్, స్లో నేరేషన్ ఉన్నప్పటికీ... సూపర్బ్ బీజీఎం & పెర్ఫార్మన్స్ వల్ల ఎంగేజ్ చేస్తుందని పేర్కొన్నారు. పతాక సన్నివేశాలు బావున్నాయని, చివరి 30 నిమిషాలు సినిమాకు ప్రాణం పోసిందని చెప్పారు. ఓ వీడియో రివ్యూయర్ అయితే థియేటర్లకు కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్ళమని పేర్కొనడం గమనార్హం. 


Also Read: 'హాయ్ నాన్న' క్రిటిక్ రేటింగ్... నాని, మృణాల్ ఠాకూర్ సినిమా హిట్టా? ఫట్టా?






సినిమాకు అసలైన సోల్ మృణాల్!
'హాయ్ నాన్న' సినిమాలో నాని, 'బేబీ' కియారా ఖన్నా నటనకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. అయితే... కొంత మంది ప్రత్యేకంగా మృణాల్ ఠాకూర్ నటన గురించి చెబుతున్నారు. సినిమాలు అసలైన సోల్ ఆమె అని ట్వీట్స్ చేస్తున్నారు. మృణాల్ మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు. 



నెగిటివ్ టాక్ కూడా ఉందండోయ్!
ట్విట్టర్ వేదికగా చాలా మంది సినిమాకు సూపర్ హిట్ రివ్యూలు ఇస్తున్నారు. అలా అని 'హాయ్ నాన్న'కు అంతటా పాజిటివ్ టాక్ అయితే ఉందని అనుకోవద్దు. కాస్త నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా డిజప్పాయింట్ చేసిందని చెబుతున్న జనాలు ఉన్నారు. 


Also Readజెర్సీ నుంచి హాయ్ నాన్న వరకు... నాని లాస్ట్ ఐదు సిన్మాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, ఎంత కలెక్ట్ చేస్తే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ అవుతుంది?


సినిమాకు వెళ్ళే ముందు ఒక్కసారి సోషల్ మీడియాలో సూపర్ హిట్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన టాప్ 10 ట్వీట్స్ మీద ఒక లుక్ వేయండి.