Hi Nanna movie distribution rights area wise details: నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న... అంటే గురువారం ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. మాస్ హిట్ 'దసరా' తర్వాత నాని నటించిన సిన్మా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బావున్నాయి. మరి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ఏ ఏరియాను ఎన్ని కోట్ల రూపాయలకు అమ్మారు? అనేది చూస్తే... 


హాయ్ నాన్న @ రూ. 28 కోట్లు!
Hi Nanna Worldwide Pre Release Business Details: 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే... సుమారు 28 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులు ఎనిమిదిన్నర కోట్లకు ఇవ్వగా... సీడెడ్ రూ. 2.60 కోట్లకు అమ్మారు. ఆంధ్రాలో ఏరియాలను రూ. 9 కోట్ల రేషియోలో విక్రయించారు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'హాయ్ నాన్న' నిర్మాతలకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విక్రయించడం ద్వారా రూ. 20.10 కోట్ల రూపాయలు వచ్చాయి. ఫీల్ గుడ్ సినిమాలు చేయడం వల్ల విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులలో నాని అంటే మంచి ఇమేజ్ ఉంది. అందువల్ల, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 5.50 కోట్ల రూపాయలు వచ్చాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కేవలం రెండు కోట్లు మాత్రమే పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే... 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 27.60 కోట్లు. బ్రేక్ ఈవెన్ కావాలంటే... సుమారు 28.50 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి. 


'హాయ్ నాన్న'కు ముందు నాని మార్కెట్ ఎలా ఉంది?
నాని లాస్ట్ ఐదు సినిమాలను ఎన్ని కోట్లకు అమ్మారు?
Nani last 5 movies pre release business: నాని లాస్ట్ రెండు సినిమాలతో పోలిస్తే... 'హాయ్ నాన్న' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తక్కువ రేటు పలికాయని చెప్పాలి. ఈ సినిమా కంటే ముందు ఆయన 'దసరా'తో భారీ విజయం అందుకున్నారు. మాస్ సినిమా కావడంతో రూ. 50 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్నారు. అంతకు ముందు 'అంటే సుందరానికి' సినిమా రైట్స్ రూ. 30 కోట్లు పలికాయి. 


Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు


'దసరా' సినిమా బాక్సాఫీస్ బరిలో రూ. 115 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే... 'హాయ్ నాన్న' ఫీల్ గుడ్ సినిమా కావడంతో బి, సి సెంటర్ థియేటర్లలో అంతగా కలెక్ట్ చేసే అవకాశాలు తక్కువ. అందుకని, తక్కువ రేటు పలికింది. నాని కూడా లాస్ట్ సినిమా కలెక్షన్స్, బిజినెస్ బట్టి కాకుండా సినిమా జానర్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది చూసి బిజినెస్ జరిగితే బావుంటుందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  'శ్యామ్ సింగ రాయ్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా రూ. 22 కోట్లు, 'గ్యాంగ్ లీడర్' రైట్స్ ద్వారా రూ. 28 కోట్లు, 'జెర్సీ' రైట్స్ ద్వారా రూ. 26 కోట్లు వచ్చాయి. 'హాయ్ నాన్న' కలెక్షన్స్ వంద కోట్లు చేరితే... నానితో పాటు మీడియం రేంజ్ హీరోలు చేసే ఫీల్ గుడ్ సినిమాలకు మార్కెట్ పెరుగుతుందని చెప్పవచ్చు. 


Also Read: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...