Balakrishna 109 Movie Updates : గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవల చిత్రీకరణ కూడా మొదలైంది. హీరోగా బాలకృష్ణ 109వ చిత్రమిది. అందుకని, NBK 109 అని వ్యవరిస్తున్నారు. ఇంతకీ, ఇందులో హీరోయిన్లు ఎవరో తెలుసా?


బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి?
బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' నిర్మిస్తోంది. ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఆమెకు నిర్మాతలు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అదీ సంగతి! 


Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసి ఉండే అవకాశాలు లేవు - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు


బాబీ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. అందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతం చేశారు. ఇప్పుడీ బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె ఉంటున్నారని తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై బాబీ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. సీన్లతో పాటు సాంగ్ కూడా ఉంటుందని టాక్. 


Also Readఫోన్ స్విచాఫ్ చేసుకొని వెళ్లిపోయారు - సంతోషం అవార్డ్స్‌లో ఏం జరిగిందో బయటపెట్టిన టీఎఫ్‌సీసీ



క్లీన్ షేవ్... గడ్డం తీసేసిన బాలకృష్ణ
విజయ దశమికి 'భగవంత్ కేసరి'తో థియేటర్లలోకి వచ్చారు బాలకృష్ణ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్లతో పాటు ప్రశంసలు అందుకుంది. మీరు ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ చూస్తే గడ్డం ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డం మైంటైన్ చేశారు. ఇప్పుడీ సినిమా కోసం లుక్ మార్చారు. క్లీన్ షేవ్ చేశారు.  


వయలెన్స్ కి విజిటింగ్ కార్డ్ బాలయ్య... 
మారణాయుధాలు... మందు... సిగరెట్!
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. గొడ్డలి, సుత్తి, కత్తి... ఒక్కటేమిటి? ఎన్‌బికె 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు చాలా ఉన్నాయి. దానికి తోడు 'వయలెన్స్ కి విజిటింగ్ కార్డు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్లు తీయడానికి ప్లాన్ చేశారట. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కావడం విశేషం. అలాగే... సిగరెట్, డబ్బులకూ చోటు కల్పించారు.