Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రామ్మూర్తి ఆటో దిగి స్కూల్ లోకి వెళ్లి వాచ్ మెన్ డ్రెస్ వేసుకొని రావటం చూస్తాడు కాళీ.


కాళీ : నువ్వు స్కూల్లో వాచ్మెన్ గా చేస్తున్నావా? నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని తెలిస్తే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మేము ఇబ్బంది పెడతామని ఇన్నాళ్లు మాకు నిజం చెప్పలేదా.. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు.


అప్పుడే అక్కడికి అమ్ములు వాళ్ళు వచ్చి కారు దిగుతారు. వాళ్లను చూసిన కాళీ బండి ఆపుతాడు.


కాళీ : వీళ్ళు ఆ లెఫ్టినెంట్ పిల్లలు కదా, వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? అంటే తన మనవళ్లు చదువుతున్న స్కూల్లోనే బావ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడన్నమాట అనుకుంటాడు.


ఆ తర్వాత మూడిగా ఉన్న పిల్లల్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు రామ్మూర్తి.


పిల్లలు: అంజుకి బాగోలేదు హాస్పిటల్ లో జాయిన్ చేశారు తాతయ్య.


కాళీ : ఇదేంటి వీళ్ళు తాతయ్య అంటున్నారు అంటే వీళ్ళకి ఉన్న బంధుత్వం గురించి వీళ్లకు ముందే తెలుసా అని కంగారు పడతాడు.


పిల్లలకి ధైర్యం చెప్పి క్లాసులకి పంపించేస్తాడు రామ్మూర్తి. తర్వాత ఈ పిల్లలకి నాకు ఉన్న బంధం ఏమిటో, ఆ చిన్న పిల్లకి బాగోకపోతే నాకు పొద్దున్న మనసులో అలజడి రావటం ఏమిటో అని అనుకుంటాడు.


 కాళీ : అదే బావ రక్తసంబంధం అంటే వాళ్ళు నీ పెద్ద కూతురు పిల్లలని తెలిస్తే ఇంకేమైపోతావో అర్జెంటుగా ఈ విషయం మా అక్కకు చెప్పాలి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు అంజు రూమ్ నుంచి వచ్చిన డాక్టర్ ని అంజుకి ఏమీ కాలేదు కదా అని అడుగుతారు అమర్ వాళ్ళు.


డాక్టర్: పాపకి అంత ఫీవర్ ఉంటే ఎందుకు నెగ్లెక్ట్ చేశారు. పాప మూడు రోజుల నుంచి పడుకోలేదు అనే విషయం మీకు తెలుసా.. నిద్ర లేకపోవడం వల్లే తను ఇలా అయిపోయింది.


మిస్సమ్మ : ఇదంతా నా వల్లే అని ఏడుస్తుంది.


అమర్: నువ్వు ఏం చేసినా తను మంచి కోసమే చేసావు ఇందులో నీ తప్పేమీ లేదు అంటాడు.


మనోహరి : మిస్సమ్మని బ్యాడ్ చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు తనని వెనకేసుకొచ్చి నన్ను బాధ పెడుతున్నావు అనుకుంటుంది.


అమర్: ఇప్పుడు పాప పరిస్థితి బానే ఉంది కదా.


బానే ఉందని చెప్పండి, తనకు ఏమీ కాదని చెప్పండి అంటూ ఏడుస్తుంది అరుంధతి.


డాక్టర్: ప్రస్తుతానికి తనకి ఏమి కాదు కానీ ఆమెతో మాట్లాడి ఆమె స్ట్రెస్ ఏమిటో కనుక్కోండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేలాగా చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది.


అమర్ వాళ్ళు లోపలికి వెళ్లి అంజూని పిలుస్తారు. అంజు కళ్ళు తెరవటంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు.


రాథోడ్: నువ్వు చేసిన పని ఏం బాగోలేదు అంజు పాప, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కానీ ఇలా ఏడిపించకూడదు అంటాడు.


మిస్సమ్మ: చాలా కంగారు పెట్టేసావు ఇక మీదట ఇలా చేయకు.


అమర్: అసలు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకున్నావు.


అంజు: ఆ స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకుంటానని అమ్మకు మాటిచ్చాను. మీరు నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక పని కూడా చేయలేదు. అందుకే ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా చేద్దామనుకున్నాను.


అమర్: ఐ యాం ప్రౌడ్ అఫ్ యు అంజు. అయినా ఈ చదువులు, అడ్మిషన్లు కొన్ని రోజులు పక్కన పెట్టు ముందు బాగా రెస్ట్ తీసుకో.


అంజు : లేదు నేను ఈ ఎగ్జామ్ రాస్తాను.


రాథోడ్: ఇంత నీరసంలో ఎగ్జామ్స్ ఎలా రాస్తావమ్మ, రాసినా నువ్వు పాస్ అవ్వలేవు. ఇప్పుడు వద్దులే వేరే స్కూల్లో జాయిన్ అవుదువు గానివి.


అంజు: కానీ ఆ స్కూల్లో అమ్ములు వాళ్ళు ఉండరు కదా, నేను వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను.


ఆ మాటలకి అందరూ బాగా ఎమోషనల్ అవుతారు. మరోవైపు ఘోర మారువేషంలో హాస్పిటల్లోకి అడుగుపెట్టి అరుంధతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.