ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉన్న శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ పురాతన ఆలయంలో అత్యంత విలక్షణమైన శివలింగం ఉంటుంది.
యముడు కోరితే శివుడు వచ్చాడట
ఆయువు తీరిన వారిని తీసుకెళ్లి తీసుకెళ్ళి యముడికి విసుగొచ్చిందట.ఓ దశలో ఈ పనిపై విరక్తి చెందిన యమధర్మరాజు తనకు మోక్షం ప్రసాదించమని శివుడిని వేడుకుంటాడు. ప్రత్యక్షమైన శివుడు ఓ రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని తద్వారా....యముడు, హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తాడు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్నవారికి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని చెబుతారు.
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
ఒకే పానవట్టంపై శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
యనమదుర్రు గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం ఉండదు. శివుడి విగ్రహం ఉంటుంది. పైగా శీర్షాసనం వేసిన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శివుడితో పాటూ పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. శివుడు తల్లకిందులుగా ఉండడానికి కారణం ఏంటంటే...యమధర్మ రాజు తపస్సు చేస్తున్న సమయంలోనే శివుడు కూడా తలకిందులుగా తపస్సు చేస్తున్నాడట. ఆ సమయంలో ఉన్నపళంగా లోక కళ్యాణం కోసం ప్రత్యక్షం కావాలని యముడు వేడుకోవడంతో యముడి కోరికను మన్నించి శివుడు, పార్వతీ యదా స్థితిలో ప్రత్యక్షమయ్యారనే కథనం ప్రచారంలో ఉంది. వందేళ్ల క్రితం ఈ దేవాలయం తవ్వకాల్లో బయటపడింది. తవ్వకాల్లో శివుని విగ్రహం, 3 నెలల బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
శ్రీ శివ రక్షా స్తోత్రం
అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||
చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ||
గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ||
గంగాధరః శిరః పాతు ఫాలమర్ధేందుశేఖరః |
నయనే మదనధ్వంసీ కర్ణౌ సర్పవిభూషణః ||
ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః ||
శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ ||
హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటిం వ్యాఘ్రాజినాంబరః ||
సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ||
జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః ||
ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స భుక్త్వా సకలాన్ కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ ||
గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ||
అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ ||
ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాఽలిఖత్ ||
ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రమ్ |