శివుడు జడలు కట్టిన కేశాలతో, తోలుదుస్తులతో, కాలసర్పాన్ని కంఠాభరణంగా వేసుకుని తిరిగితే  అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతకన్నా ఒద్దికైన ఆలుమగలు ఎక్కడుంటారు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆదిదంపతులుగా చెబుతారు. ఈ ఆదిదంపతులకు వివాహం జరిగిన ప్రదేశమే కళ్యాణ సుందర్ ఆలయం. 


కళ్యాణసుందర్‌ ఆలయం. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుట్టాలమ్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీపరమేశ్వరులు పాణిగ్రహణ ( చేతిలో చేయి వేసి పట్టుకున్న) విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అంటే ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులు భావిస్తారు.  అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా పెళ్లవుతుందని విశ్వాసం. 


Also Read: పార్వతీపరమేశ్వరుల కల్యాణం చూతము రారండి
ఈ  ఆలయాన్ని తొమ్మిదో శతాబ్ధంలో చోళరాజులు నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత 1336-1485 మధ్య సంగమ రాజవంశం , 1491-1570 మమధ్య తులువా రాజవంశం విస్తరణ పములు చెపట్టింది. అనంతరం ఆలయ అభివృద్ధిలో విజయగర పాలకుల పాత్ర కూడా ఉంది.  ఈ ఆలయంలో ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రత్యేక పూజలు, సేవలు ఉంటాయి. కేవలం వైష్ణవ ఆలయాల్లో మాత్రమే ఇలాంటి సేవలుంటాయి. ఇక్కడ మాత్రం శివాలయంలోనూ ఉదయం నుంచి రాత్రి వరకూ వరుస సేవలు కొనసాగుతాయి. నవ గ్రహదేవతల్లో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపంలో ఉండటం వలన రాహుగ్రహపీడ కోసం కూడా పూజలు చేసుకుంటారు. 


Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
శివ పంచాక్షరి స్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై కారాయ నమశ్శివాయ


మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ
మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై కారాయ నమశ్శివాయ


శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ


వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై కారాయ నమశ్శివాయ 


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై కారాయ నమశ్శివాయ 


పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ
శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే