ద్వాదాశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీమల్లికార్జునస్వామి వారికి అష్టాదశ మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారికి నిలయమైన శ్రీశైలం మహాక్షేత్రం. భూ మండలానికి నాభిస్థానమని భూకైలాసంగా ప్రసిద్ధమైన దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చలువ పందిళ్లు, ఆహారం, వైద్యం, పుణ్య స్నానాలకు షవర్స్ సహా సకల ఏర్పాట్లు చేశారు. మార్చి 4 బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నారు ప్రత్యేకంగా శివదీక్ష స్వీకరించిన స్వాములు ప్రత్యేక క్యూలైన్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 9.00 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈవో లవన్న అర్చకులు, వేదపండితులు శ్రీకారం చుట్టారు.
బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు
- 23 బుధవారం భృంగి వాహనసేవ
- 24 గురువారం హంసవాహనసేవ
- 25 శుక్రవారం మయూరవాహనసేవ
- 26 శనివారం రావణవాహన సేవ
- 27 ఆదివారం పుష్పపల్లకీ సేవ
- 28 సోమవారం గజవాహనసేవ
- మార్చి 1 వ మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం ప్రభోత్సవం,నందివాహనసేవ. ఇదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం పాగాలంకరణ ,, స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
- మార్చి 2 బుధవారం రథోత్సవం , తెప్పోత్సవం
- మార్చి 3 గురువారం యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
- మార్చి 4 శుక్రవారం అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగింపు....
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం హైస్కూలు పక్కన టూరిస్టు బస్టాండ్ వద్ద శివాజీ స్ఫూర్తి కేంద్రం ముందు భాగంలో కేటాయించారు. క్షేత్రపరిధిలో వివిధ ప్రాంతాల్లో త్రాగునీటి కోసం శివగంగా జలప్రసాదం సిద్ధం చేశారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని సర్వ దర్శనం, ఆర్జిత సేవలను అనుమతించడం లేదని ఈవో Lavanna ప్రకటించారు. మార్చి 4వ తేదీ వరకూ మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈఓ తెలిపారు. శ్రీఘ్రదర్శనం రూ.200, అతిశీఘ్ర దర్శనం రూ.500, ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. భక్తులంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మరో వైపు మాస్కులు లేకుండా భక్తులు ఆలయంలోకి అనుమతించడం లేదు.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే