Shyamala navratri 2024 Date Time: శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు..ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా..దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ గుప్త నవరాత్రులు ఫిబ్రవరి 10 నుంచి 18 వరకూ ఉంటాయి. శక్తి ఆరాధనకు ఈ తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే గుప్త నవరాత్రులు అనే పేరువచ్చింది. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే...శ్యామల నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు. 
 
శ్యామలా దేవి
భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో  శ్యామలాదేవిని సృష్టించింది. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లలిలాతదేవి. అందుకే  శ్యామలాదేవిని  మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువుకి దశావతారాలు ఉన్నట్లే అమ్మవారికి కూడా  పది రూపాలు ఉన్నాయి,వాటిని ఉపాసించే విధానాలనే  "దశమహా విద్యలు" అంటారు.ఆ విద్యలు ఇహాన్ని,పరాన్ని కూడా ఇస్తాయి కాబట్టి మహావిద్యలు అని అంటారు.  దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. 


Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!


మాతంగి అనే పేరు ఎలా వచ్చింది 
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. లలితా త్రిపుర సుందరి దేవి మంత్రిణీ స్వరూపమే "శ్యామలాదేవి".ఆమెనే "మాతంగి","రాజమాతంగి"అని కూడా అంటారు. అందుకే
లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవి గురించి 3 చోట్ల ప్రస్తావన ఉంటుంది. 



  • గేయచక్ర రథారూఢ "మంత్రిణీ" పరిసేవితా

  • "మంత్రిణ్యంబా' విరచిత విషంగ వధతోషితా

  • "మంత్రిణీ"న్యస్త రాజ్యధూః


అమ్మవారికి కుడి వైపు శ్యామలాదేవి,ఎడమ వైపు వారాహి అమ్మవారు ఉంటారు. ఈ ముగ్గురు మూడు శక్తి స్వరూపాలు


Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!



  • ఇచ్చాశక్తి-లలితా త్రిపురసుందరి దేవి

  • జ్ఞానశక్తి-శ్యామలాదేవి

  • క్రియాశక్తి-వారాహి దేవి 


అందుకే లలితా సహస్రనామంలో "ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి"అనే నామంతో ఆరాధిస్తారు...శ్యామలదేవిని పూజిస్తే  " విద్య, ఉద్యోగంలో ఉన్నతి, సంగీత, సాహిత్యాల మీద పట్టు, వాక్సుద్ధి కలుగుతుందని చెబుతారు.


గుప్త నవరాత్రుల్లోని తొమ్మిదిరోజులు అమ్మవారి అలంకారాలు



  • తొలిరోజు కాళికా దేవి..

  • రెండో రోజు త్రిపుర తారా దేవి (శైలపుత్రి పూజ)

  • మూడో రోజు సుందరీ దేవి (బ్రహ్మచారిని పూజ)

  • నాలుగో రోజు భువనేశ్వరి దేవి (చంద్రఘంట పూజ)

  • ఐదో రోజు మాతా చిత్రమాతా త్రిపుర దేవి (కుష్మాండ పూజ)

  • ఆరో రోజు భైరవి దేవి (స్కందమాత పూజ)

  • ఏడో రోజు మాధుమతి దేవి (శక్తి)

  • ఎనిమిదో రోజు మాతా బాగళాముఖి దేవి (కాత్యాయని పూజ)

  • తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా (మహాగౌరి పూజ) అలంకరించి పూజిస్తారు.


మాఘ గుప్త నవరాత్రి పండుగ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఘనంగా జరుపుకుంటారు. 


Also Read: కాకిలో ఇన్ని మంచి లక్షణాలున్నాయా - మీరు చాలా ఆశ్చర్యపోతారు!


శ్యామలా దండకం


మాణిక్యవీణా ముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.


చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే జగదేకమాతః


మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ
జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలాశుకప్రియే