Vasant Panchami 2024 Remedies for  Zodiac Signs:  వసంత పంచమి ఫిబ్రవరి 14న వచ్చింది. జ్ఞానం, వివేకం, విజ్ఞానం, అభ్యాసానికి అధిదేవత అయిన చదువుల తల్లిని బాసలో ఇసుకతో వ్యాసుడు   ప్రతిష్టించిన రోజు ఇది. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యత. ఈ రోజు సరస్వతీ ఆరాధాన వల్ల మీ మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయంటారు పండితులు. మీ రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలివే...


మేష రాశి (Aries) 
 
వసంత పంచమి రోజు మేష రాశివారు పూజా సమయంలో సరస్వతీ కవచాన్ని పఠించండి. ఇది మీకు చదువుపై ఏకాగ్రత కలిగిస్తుంది . మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.


వృషభ రాశి (Taurus)


ఈ రోజు వృషభ రాశివారు సరస్వతీ దేవికి తెల్ల చందనం , పసుపు రంగు పూలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పురోభివృద్ధికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి


Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!


మిథున రాశి (Gemini) 


ఈ రాశివారు వసంత పంచమి రోజు పూజా సమయంలో సరస్వతీ దేవికి కలం సమర్పించి ఈ కలాన్ని ఉపయోగించి శుభకార్యాలు ప్రారంభించండి. దీంతో అన్ని కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి.


కర్కాటక రాశి (Cancer)  


ఫిబ్రవరి 14 వసంతపంచమి రోజు కర్కాటక రాశివారు సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి  ఖీర్ నైవేద్యంగా పెట్టవచ్చు.


సింహ రాశి (Leo)


సింహ రాశి ఈ రోజు సరస్వతీ పూజలో భాగంగా గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.


Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!


కన్యా రాశి  (Virgo) 


కన్యా రాశివారు వసంత పంచమి రోజు పేద పిల్లలకు పెన్నులు, పుస్తకాలు , పెన్సిళ్లు దానం చేయండి.


తులా రాశి (Libra) 


వసంత పంచమి రోజు ఈ రాశివారు  పసుపు లేదా తెలుపు రంగుల వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయండి. దీనితో పాటు, పూజలో పసుపు రంగు లడ్డూలను సమర్పించండి.
 
వృశ్చిక రాశి (Scorpio) 
 
జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి సరస్వతీ దేవిని పూజించి, కలం సమర్పించండి. పూజ అనంతరం శుభ కార్యాలకు ఈ పెన్ను ఉపయోగించండి


Also Read: కాకిలో ఇన్ని మంచి లక్షణాలున్నాయా - మీరు చాలా ఆశ్చర్యపోతారు!


ధనుస్సు రాశి  (Sagittarius) 


 ధనుస్సు రాశి వారు శారదా తల్లిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ అనంతరం పసుపు రంగు స్వీట్ ను నైవేద్యంగా సమర్పించాలి


మకర రాశి (Capricorn) 


వసంత పంచమి రోజు మకర రాశివారు పేదలకు అన్నదానం చేయండి


కుంభ రాశి  (Aquarius) 


కుంభరాశి వారు ఈ రోజు పేద పిల్లలకు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి


Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!


మీన రాశి (Pisces) 


వసంత పంచమి రోజు మీన రాశివారు సరస్వతీ పూజ అనంతరం  బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులు దానం చేయాలి. దీంతో కెరీర్‌లో మీకు ఎదురైన అడ్డంకుల నుంచి బయటపడొచ్చు


గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.