Lunar eclipse 2024:  2024లో మొదటి చంద్రగ్రహణం మార్చి 25 న ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:23 నుంచి 03:02 వరకు అంటే దాదాపు నాలుగున్నర గంటల వ్యవధి ఉంటుంది. అయితే కన్యా రాశిలో సంభవిస్తోన్న ఈ చంద్రగ్రహణం...మన దేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు.  సాధారణంగా సూర్యగ్రహణం సూతకాలం గ్రహణానికి 12 గంటల ముందు , చంద్రగ్రహణం సూతకాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే  ఆలయాల్లో పూజలు ఆగిపోతాయి. ఆలయాలు క్లోజ్ చేస్తారు. ఎవ్వరూ ప్రవేశించరు, ఎలాంటి పూజలు నిర్వహించరు... గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అయితే హోలీ రోజు చంద్రగ్రహణం మనదేశంలో కనిపించదు కాబట్టి ఇవేమీ పాటించాల్సిన అవసరం లేదు. అయితే హోలీ రోజు గ్రహణం రావడంతో మరి హోలీ జరుపుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది...


Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!


గ్రహణానికి-హోలీకి సంబంధం లేదు


మనదేశంలో చంద్రగ్రహణం కనిపించదు..అందుకే హోలికా దహనం , హోలీ జరుపుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా హోలికా దహనం పౌర్ణమి ఘడియల్లో అర్థరాత్రి సమయంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 24 ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర దాటిన తర్వాత పౌర్ణమి ఘడియలు మొదలయ్యాయి...మర్నాడు ఉదయం పదకొండున్నర వరకూ పౌర్ణమి ఉంది. అంటే 24 రాత్రికి పౌర్ణమి ఉండడంతో...హోలికా దహనం 24 రాత్రి నిర్వహిస్తారు. 


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!


హోలికా దహన్ శుభ సమయం 


మార్చి 24 రాత్రి 11:13 నుంచి 12:27 వరకు గంటా 14 నిముషాల సమయం హోలికా దహనానికి శుభసమయంగా చెబుతారు. అందుకే 24 రాత్రి హోలికా దహన్ నిర్వహించి...25 ఉదయం రంగులహోలీ ఆడుకోవచ్చు. గ్రహణానికి - హోలీకి ఎలాంటి సంబంధం లేదు...హోలికా దహనం చూస్తే మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు..అయితే నూతన దంపతులు మాత్రం హోలీకా దహనం చూడకూడదు. ఎందుకంటే హోలీకా దహనం అంటే ఇంచుమించు శవదహనం లాంటిదే అని..అందుకే దీనిని నూతన దంపతులు చూస్తే వారి జీవితంలో బాధలు వెంటాడుతాయంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చతుర్థశి రోజు కామదహనం నిర్వహిస్తారు. ఆ తర్వాత రోజు హోలీ ఘనంగా జరుపుకుంటారు. 


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది


హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం యూరప్, ఈశాన్య ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో   కనిపిస్తుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికాలో కూడా కనిపిస్తుంది. మన దేశంలో పగటిపూట సమయం కావడం వల్ల ఈ గ్రహణ దోషకాలం వర్తించదు.


గమనిక:  కొన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..


Also Read: మనిషి జీవితంలో ముఖ్యమైన 16 ఘట్టాలివే - ఆ ఒక్కటీ మినహా మిగిలిన 15 మీ చేతిలోనే!