Love Horoscope 21 May
మేషం
ప్రేమికులు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రపోజ్ చేసినప్పటి నుంచి చాలా విషయాలను గుర్తుచేసుకుని ఉత్సాహంగా గడుపుతారు. మరికొందరు స్కూల్ డేస్ లో ప్రియంగా భావించిన స్నేహితులను కలుస్తారు. వివాహితులు జీవిత భాగస్వామికి బహుమతులు అందిస్తారు.
వృషభం
ఈ రాశివారు భాగస్వామి జ్ఞాపకాలలో మునిగితేలుతారు. ఈ రోజు మీకు ఏ పనీ చేయాలని అనిపించదు. ఏకాంతంలో ఉండేందుకు ఇష్టపడతారు. కలిసేందుకు చేసే ప్రయత్నాలు విఫలం అవడంతో నిరాశలో ఉంటారు. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి షికారు వెళ్తారు.
మిథునం
చాలా కాలంగా మీ మనసులో ఉన్న వ్యక్తికి ప్రపోజ్ చేసేందకు ఇదే మంచి సమయం. సంకోచించకుండా మీ మనసులో మాట చెప్పండి. చుట్టూ పరిస్థితులు చూసుకుని ప్రపోజ్ చేయండి. ఈ రాశి మగవారు వారి వయసుకన్నా పెద్దవారిని ఇష్టపడతారు.
Also Read: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
కర్కాటకం
ప్రేమికులకు ఈరోజు మంచి రోజు కాదు. లేనిపోని గొడవల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. మీరు ప్రేమించిన వారిని మీట్ అవ్వాలంటే జాగ్రత్తగా ఉండటమో, లేదంటే పూర్తిగా మీట్ అవకుండా ఉండటమే మంచిది. కొన్ని విమర్శలకు సమాధానం చెప్పేబదులు సైలెంట్ గా ఉండటమే మంచిది. ఖర్చులు తగ్గించండి.
సింహం
నూతన వధూవరులు రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. జీవితంలో కొత్త అనుభూతి కలుగుతుంది. ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది.
కన్య
మొబైల్‌లో భాగస్వామితో సుదీర్ఘ సంభాషణ ఉంటుంది. ప్రపోజ్ చేసేందుకు మీకు మంచి సమయం. మీరు ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి కుళ్లుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీ ప్రేమకు వ్యతిరేక ఎదురవుతుంది.
Also Read: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
తులా
ప్రేమికులు తమ భాగస్వామిని కలిసిన తర్వాత రొమాంటిక్‌గా ఉంటారు. ఈరోజు ప్రేమ పాటలు వినాలనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు తన జీవితభాగస్వామి ఎవరో గుర్తించగలుగుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది.
వృశ్చికం
ఆరోగ్యం సరిగా లేని కారణంగా, మీరు మీ భాగస్వామిని కలవలేరు. విచారంగా ఉంటారు. కొంతమంది ప్రేమికులు ఫోన్‌లో మాట్లాడతారు. పెళ్లి దిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం.
ధనుస్సు
ప్రేమ జంటల మధ్య సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి వ్యతిరేకంగా మాట్లాడటం సబబు కాదు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ భాగస్వామికి బహుమతి ఇస్తారు. అవివాహితుల వివాహం నిశ్చయమవుతుంది.
మకరం
మీ జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడకండి. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. పాత ప్రేమికులను కలుస్తారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
కుంభం
ఆఫీసులో సహోద్యోగుల్లో మీ మనసుకు ఒకరు దగ్గరవుతారు. ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. కొందరు ప్రేమికులు భాగస్వామిని కలవడంతో సంతోషంగా ఉంటారు. కలసి లంచ్ కి కానీ, డిన్నర్ కి కానీ వెళతారు.
మీనం
ప్రత్యర్థుల వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. ప్రేమికులు కలిసే అవకాశం తక్కువ. దంపతులు సంతోషంగా ఉంటారు.
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి