Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మే 21 శనివారం రాశిఫలాలు

మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరుతారు. ధార్మిక యాత్రలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. సలహాలు ఇవ్వడంపై శ్రద్ధ తగ్గంచండి. వైవాహిక సంబంధాల్లో ఒత్తిడులు తొలగిపోతాయి. యువతకు రోజు చాలా మంచిది. 

Continues below advertisement

వృషభ రాశి
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.ఉన్నతాధికారుల అండ మీకుంటుంది.ఏదో విషయం గురించి ఆలోచిస్తారు. మానసికంగా ఏదో విషయంలో ఇబ్బంది పడతారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. 

మిథున రాశి
దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా బలహీనంగా అనిపిస్తుంది. చక్కగా ఆకట్టుకునేలా మాట్లాడండి. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య పోటీ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. అత్తమామలు వైపు కొంచెం అసంతృప్తిగా ఉంటారు. వివాదాలు పెరుగుతాయి. 

Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

కర్కాటక రాశి
ఉద్యోగులకు కార్యాలయంలో  టెన్షన్లు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీకు జ్ఞానోదయం చేసే వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి. పనివిషయంలో కష్టపడతారు, అంకితభావంతో చేస్తారు. ప్రేమ వ్యవహారాల కారణంగా టెన్షన్ పెరుగుతుంది. ఇంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య  సమస్యలు దూరమవుతాయి. 

సింహ రాశి
గతంలో పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సమర్థత  పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వ్యాపార విషయాల్లో సయోధ్య కుదురుతుంది. ఆర్థికపరిస్థితి బావుంటుంది. శత్రువులు  యాక్టివ్ గా ఉంటారు... మీరు అప్రమత్తంగా ఉండండి.  ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. 

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా విభేదాలు రావొచ్చు. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. ప్రేమ సంబంధాల్లో వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ సహోద్యోగులు ఇబ్బందుల్లో పడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. 

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Continues below advertisement
Sponsored Links by Taboola