Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మే 21 శనివారం రాశిఫలాలు

తులారాశి
ఈ రాశివారు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగం  గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక సమస్య తీరుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవించండి. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. పని పట్ల క్రమశిక్షణతో వ్యవహరించండి.  ఇంట్లో క్రమశిక్షణ పాటించాలి. ప్రతికూలతకు దూరంగా ఉండండి. మీరు కడుపు నొప్పి లేదా జ్వరంతో బాధపడొచ్చు.
 
వృశ్చిక రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజంతా మీ సమయాన్ని సరదాగా గడుపుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. రచనలవైపు మొగ్గు చూపవచ్చు. ప్రేమికులు పెళ్లి చేసుకునేదిశగా అడుగు వేయవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 

Continues below advertisement

ధనుస్సు రాశి
ఈ రోజు స్నేహితులని కలుస్తారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. వ్యాపారంలో అవసరమైన ఒప్పందాలను పూర్తి చేయగలుగుతారు. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఓ పెద్ద బాధ్యతను నిర్వహించాల్సి వస్తుంది. 

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

మకర రాశి
ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తారు. పెండింగ్ లో ఉన్న న్యాయపరమైన విషయాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. పర్యాటక రంగానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

కుంభ రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శని అనుగ్రహం వల్ల మీ సమస్య తీరుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. పిల్లలతో సంతోష సయమం  గడుపుతారు. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. ఉద్యోగాలు మారేందుకు తొందరపడకండి.

మీన రాశి
రెండు మూడు రోజులుగా ఉన్న గందరగోళం ఈ రోజు తొలగిపోతుంది. ప్రేమికులకు మంచి రోజు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు.  అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో పనులు పూర్తిచేసుకోగలుగుతారు. విమర్శలకు భయపడవద్దు.

Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Continues below advertisement
Sponsored Links by Taboola