సనాతన ధర్మంలో పురాణేతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.ఎందుకంటే పూర్వకాలం నుంచి హిందువులంతా సూర్యోపాసకులే. అందుకే మన పండుగలన్నీ సౌరమానం అంటే సూర్యుడిని ఆధారంగా చేసుకునే నిర్ణయిస్తారు.ముఖ్యంగా ఆదివారం పైగా సప్తమి తిథి వచ్చిన రోజు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతారు. 


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీలౌల్య మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్య్రం, సూర్యలోకం స గచ్ఛతి ||



  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి

  • ఒంటికి, తలకు నూనె పెట్టుకోకూడదు

  • ఆదివారం అభ్యంగన స్నానం చేయరాదు, షాంపూ పెట్టుకోకుండా తలకి స్నానం చేయాలి

  • ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి

  • బ్రహ్మచర్యం పాటించాలి

  • సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచి స్నానం చేయకుండా అన్నపానీయాలు తీసుకునేవారు అనారోగ్యం పాలవుతారు


Also Read: సూర్యుడు ఒక్కడే కదా..మరి ద్వాదశ ఆదిత్యులు ఎవరు..


సూర్యారాధన చేస్తే...



  • సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది

  • నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది

  • అవివాహితులకు వివాహం జరుగుతుంది

  • సంతాన సమస్యలు తొలగిపోతాయి, ప్రశాంతత లభిస్తుంది

  • భానుసప్తమి రోజు చేసే స్నానం, దానం, దపం, హోమం లక్ష రెట్ల ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనం


ఈ రోజు ఆవుపాలతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యం పెడతారు. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం ఉంటే అసాధ్యం అయినది ఏమీ ఉండదు. లోకంలోని చీకట్లను పారద్రోలుతూ, వెలుగులు పంచే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడుగా భావించి, ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి ఉంది. భాను సప్తమి రోజు ఉదయాన్నే స్నానంచేసి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, నమస్కరించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనీ, పుణ్యఫలాలు చేకూరతాయనేది ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. "ఓం నమో ఆదిత్యాయ నమః" అనే మంత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు ఆరోగ్యాన్న ప్రసాదిస్తాడని ప్రతీతి. ఈ నియమాలు కేవలం భానుసప్తమికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించాలి. శ్రీరాముడు అంతటి వాడు రావణుడిని యుద్ధంలో జయించేందుకు సూర్యుడిని ప్రార్థించాడు. అంతుకే సూర్యడుని ఆరాధించేవారికి విజయం తథ్యం అని పండితులు చెబుతారు. 


Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే


Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!