Gold Silver Price Today  19th May 2022 : భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(బుధవారం) గ్రాముకి రూ.45 తగ్గింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.5.50 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,290గా ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇవాళ(బుధవారం) తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.490 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి 55 పైసలు తగ్గి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,000(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల ధర రూ.50,290
దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700
ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290


వెండి ధరలు : 


భారత మార్కెట్ లో వెండి ధరలు సల్వంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,000 ఉండగా, చెన్నైలో రూ.65,400గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,100 ఉండగా, కోల్‌కతాలో రూ.61,100, బెంగళూరులో కిలో వెండి రూ.65,400 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 65,400 వద్ద కొనసాగుతోంది.


రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం


పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.