Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

2022 మే 19 గురువారం రాశిఫలాలు

మేషం
మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. వ్యాపారులు మరింత కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పనుల నాణ్యతపై చాలా శ్రద్ధ వహించాలి. మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచండి. మీ అలవాట్లు, మీ తీరుపై విమర్శలు ఎదుర్కొంటారు.బంధువులతో సంప్రదింపుల వల్ల ప్రయోజనం పొందుతారు.

Continues below advertisement

వృషభం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు. కడుపు నొప్పితో ఇబ్బందిపడతారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. అత్యవసం అయితే తప్ప ప్రయాణం చేయవద్దు.ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 

మిథునం
గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక సమస్యల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు వ్యాపారంలో కొత్త ప్రణాళికను అనుసరించడం మంచిది. ఆఫీసులో సహోద్యోగుల సహకారం మీకు ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

కర్కాటకం
అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. సహోద్యోగుల సహకారంతో మీ పనులు త్వరగా పూర్తవుతాయి.మీరు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి సలహాతో మీ పని ఫలవంతమవుతుంది.

సింహం
అందర్నీ నమ్మొద్దు. కొన్ని పనులు బలవంతంగా చేయాల్సి రావొచ్చు. సోషల్ మీడియాలో సున్నితమైన , తప్పుదారి పట్టించే పోస్ట్‌లను లైక్ చేయడం షేర్ చేయడం మానుకోండి. ఇంటి పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. కెరీర్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య
వ్యాపారానికి సంబంధించిన ఎక్కువ పని కారణంగా మీరు అలసిపోతారు. పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతారు. కొందకు తీయగా మాట్లాడి వారి పనులు పూర్తిచేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటారు. మీ ఖర్చులను తగ్గించుకోండి. ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 

Also Read:  ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..

తులా
సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత పనుల్లో చిక్కులు తొలగిపోతాయి.వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం పొందుతారు. 
 
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు మంచి రోజు. చిన్నతరహా పరిశ్రమలు నిర్వహించేవారికి కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయి. విద్యార్థులు తమ చదువు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. స్వార్థం కోసం తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. పనికిరాని పనులతో సమయాన్ని వృథా చేయకండి.

ధనుస్సు
నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఆ దిశగా అడుగేయవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. కుటుంబంతో సరదాగా ఉంటారు. చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎవ్వరిపైనా నోరు పారేసుకోవద్దు. 

మకరం
ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. పని చేయాలనే ఆసక్తి ఉండదు. మద్యానికి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టొద్దు. ఉద్యోగులు కార్యాలయంలో అవమానాలు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.

Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..

కుంభం
మీ ప్రతిష్ట పెరుగుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ప్రాయణం వాయిదా వేయండి.

మీనం
ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న పని పూర్తవడంతో సంతోషంగా ఉంటారు. బంధువులను కలిసే అవకాశం ఉంది.గత పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. మీరు మీ ఫిట్‌నెస్ విషయంలో టెన్షన్ పడతారు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మేయకండి. 

Continues below advertisement
Sponsored Links by Taboola