మే నెలలో పుట్టిన వారి లక్షణాలివే
మే నెలలో పుట్టిన వారు ప్రతిభావంతులు. ప్రశంసనీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోగలగుతారు. మే నెలలో జన్మించిన వారిలో వృషభం, మిథునం రెండు రాశుల లక్షణాలు ఉంటాయి. 



  • మే నెలలో పుట్టినవారికి త్యాగబుద్ధి ఎక్కువ, తమకు కావాల్సిన పని అయ్యేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు

  • వీరికి ప్రయాణాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది, కొత్తకొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది

  • పార్టీలంటే వీళ్లకి మహా సరదా, స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తారు

  • ఉదారబుద్ధి ఎక్కువ, చాలా ఓర్పుగా ఉంటారు

  • అందరితోనూ స్నేహంగా, ప్రేమగా ఉంటారు, కొత్తవారితోనూ తొందరగా కలసిపోతారు, నమ్మినవారికి ప్రాణాలిస్తారు

  • ఆహారానికి మంచి ప్రాముఖ్యత ఇస్తారు, అవసరం అయితే మంచి మంచి వంటలు స్వయంగా వండుకుని ఆస్వాదిస్తారు

  • ఇంటిని పరిశుభ్రంగా, కళాత్మకంగా అలంకరించడంపై ఆసక్తి ఉంటుంది

  • ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది కళాకారులు ఉంటారు

  • మే నెలలో జన్మించిన వారికి శృంగార వాంఛ ఎక్కువేనట

  • న్యాయంగా, ధర్మంగా పోరాటం చేస్తారు..అందుకే చాలావిషయాల్లో గెలుపు కన్నా ఓటమే వీరిని పలకరిస్తుంది. అయినప్పటికీ ధర్మబద్దంగా పోరాడామన్న సంతృప్తితో ఉంటారు

  • ఈ నెలలో పుట్టిన వారిలో 70శాతం మందికి చిన్నవయసులోనే పెళ్లవుతుంది

  • మే నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిలవుతారు కానీ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, కళారంగం..ఇలా ఏ రంగంలో ఉన్నా మంచి స్థాయిలో ఉంటారు. గౌరవం, పేరు సంపాదించుకుంటారు

  • మే నెలలో పుట్టిన వారు క్రియేటివ్ గా ఉంటారు, షార్ట్ టెంపర్ ఎక్కువ


Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో


మే నెలలో పుట్టిన వారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టినవారికి కిడ్నీ వ్యాధులు, రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రావొచ్చు


ఆర్థిక పరిస్థితి: ధనం సంపాదించాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. సంపాదిస్తారు, అనుభవిస్తారు...


అనుకూలవారాలు: మంగళవారం, శుక్రవారం


కలిసొచ్చే రంగులు: నీలం, గులాబీ రంగు


ఈ ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.


Also Read: ఈ ఐదు రాశులవారికి పెళ్లికన్నా సహజీవనమే ఇష్టమట, మీరున్నారా ఇందులో


Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే