ప్లవ నామ సంవత్సరాన్ని పూర్తిచేసుకుని శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 లో శుభకృత్ నామసంవత్సరం 36వది. గతంలో  1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. 


మేష రాశి  :   అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయం: 14 , వ్యయం:14  , రాజపూజ్యం:3  , అవమానం:6


వృషభ రాశి  :  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6


మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2


కర్కాటరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2


సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5


కన్య రాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5


తుల రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5


వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1


ధనస్సు రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1


మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4


కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4


మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7


Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?


ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు.
ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతోకొంత మిగులుస్తారు
ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి
ఆదాయం, వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చుపెట్టేస్తారు- అంటే లాభం నష్టం రెండూ ఉండవు.
రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించే వారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువ ఉంటుంది
రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొడిగేవారి కన్నా తిట్టేవారి సంఖ్యే ఎక్కువన్నమాట
రాజపూజ్యం-అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులున్నట్టు...


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


 ఇవి పండితుల సలహాలు సూచనలతో రాసిన ఫలితాలు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం....