సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి.
పాపం-వచ్చే జన్మలో పుట్టుక
గోహత్య - మరగుజ్జు వాడుగా పుడతాడు
కన్యాహత్య - కుష్టు రోగిగా జన్మిస్తాడు
స్త్రీ హత్య, గర్భ పాతం - నిత్య రోగ బాధ
స్వగోత్ర స్త్రీ సంబంధం - నపుంసక జన్మ
గురుభార్యతో అక్రమ సంబంధం - దుష్కర్మం గల జన్మ
మాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు - అతిరక్ష అనే కుష్టు వ్యాధి
ఎవ్వరికీ పెట్టకుండా స్వీట్స్ తినేవాడు- గరళగండ రోగ జన్మ పొందుతాడు
శ్రార్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు - చిత్రకుష్టువు రోగి జన్మ
గురువుని అవమానించిన వాడు - అపస్మార రోగి జన్మ
వేద శాస్త్రాలని నిందించేవాడు - పాండురోగి జన్మ
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు - మూగవాడి జన్మ
ఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే - ఒక కన్ను లేనివాడిగా పుడతాడు
పెళ్లి చెడగొట్టే వాడు - పెదవుల్లేని జన్మ పొందుతాడు
పుస్తకం దొంగతనం చేస్తే- అంధుడై పుడతాడు
గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు - కుంటి వాడై పుడతాడు
అబద్ధాలు చెప్పేవాడు - స్పష్టమైన వాక్కు లేని జన్మ
అబద్ధాలు వినేవాడు - చెవిటివాడిగా పుడతారు
విషం పెట్టేవాడు - ఉన్మత్త జన్మ పొందుతాడు
ఇళ్ళు తగలేబెట్టే వాడు - బట్టతలతో బాధపడతాడు
Also Read:పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
బంగారం దొంగలించే వాడు - పుప్పి గోళ్ళతో జన్మిస్తాడు
లోహాలు దొంగలించే వాడు - నిర్ధనుడిగా జన్మిస్తారు
అన్నం దొంగలించే వాడు - ఎలుకలా పుడతారు
ధాన్యం దొంగలించే వాడు - మిడత జన్మెత్తుతారు
నీళ్లు దొంగలించే వాడు - చాతకపక్షిలా జన్మిస్తారు
కూరలు,ఆకులు దొంగలించే వాడు - నెమలి జన్మ
తేనె అపహరించేవాడు - దోమగా జన్మిస్తాడు
మాంసం అపహరించే వాడు - గ్రద్ద గా జన్మిస్తాడు
ఆత్మ హత్య చేసుకుంటే - కొండ మీద నల్ల త్రాచుగా పుడతాడు
ఇవన్నీ పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన వివరాలు, వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట