Shahi Snan Kumbh Mela 2025 : జనవరి 29న చంద్రుడు, సూర్యుడు, బుధుడు ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇదే రోజు మౌని అమావాస్య కావడం మరింత విశేషం. ఈ సమయంలో ఈ మూడు రాశులవారు కుంభమేళాలో రాజస్నానం ఆచరిస్తే విశేష ఫలితం లభిస్తుంది.
జనవరి 14 న మకర రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు ఫిబ్రవరి 12 వరకూ ఇదే రాశిలో సంచరించి ఆ తర్వాత కుంభంలోకి పరివర్తనం చెందుతాడు
ప్రతి రోజూ నక్షత్రం సంచారమే చంద్రుడి పరివర్తనం...
బుధుడు జనవరి 23 న మకర రాశిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 09 వరకూ ఇదే రాశిలో ఉంటాడు
అంటే...సూర్యుడు, బుధుడితో పాటూ చంద్రుడు కూడా మౌని అమావాస్య రోజు మకరంలోనే ఉంటాడు...
ఇలా మూడు గ్రహాల కలయినే జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రాహి యోగం అంటారు..
సాధారణంగా ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది..ఇప్పుడు మూడు గ్రహాలు ఒకే చోట చేరడం కొన్ని రాశులవారికి విశేష ఫలితాలను అందిస్తోంది. కుంభమేళా కూడా కలసి రావడంతో ఈ సమయంలో ఈ మూడు రాశులవారు కుంభమేళాలో రాజస్నానం ఆచరిస్తే కలిగే ఆ ఫలితాన్ని మీరు అంచనావేయలేరు..
Also Read: జనవరి 29 మౌని అమావాస్య..ఈ రోజు రావిచెట్టు దగ్గర దీపం వెలిగిస్తే!
ధనస్సు రాశి ( Sagittarius )
ధనస్సు రాశి వారికి మౌని అమావాస్య...త్రిగ్రాహి యోగం సానుకూల ఫలితాలను అందిస్తోంది. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న ఇక్కట్లు తొలగిపోతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీట్ పొందుతారు. విదేశాల్లో పట్టుబడి పెట్టే వ్యాపారులకు కలిసొస్తుంది. రియల్ ఎస్టేర్ రంగంలో ఉండేవారికి మంచి లాభాలొస్తాయి. అవివాహితులకు వివాహం జరిగే సూచలున్నాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న సొంతింటి కల నెరవేరుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఆందోళను మాయమైపోతాయి.
కుంభ రాశి (Aquarius )
కుంభ రాశి వారికి కూడా మౌని అమావాస్ శుభఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది వీరికి ఏలినాటి శని తొలగిపోతుంది. ఫలితంగా ఈ సమయంలో కుంభమేళాలో రాజస్నానం ఆచరించినట్టైతే ఇప్పటివరకూ వెంటాండిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఊహించని విధంగా ధనం చేతికందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలతలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్లో ఎలా కవర్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి
మీన రాశి (Pisces )
ఈ రాశివారికి మౌని అమావాస్య, త్రిగ్రాహి యోగం ఈ రెండూ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే కోర్టుసమస్యలలో చిక్కుకున్నవారు బయటపడతారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ఒక్క రోజు కుంభమేళా..ఇది కదా ప్లాన్ అంటే - ఇది ఫాలో అయితే ప్రమాదకర ఘటనలకు ఛాన్సే ఉండదు!