Mahakumbh 2025: సింగిల్ గా అయినా, స్నేహితులతో అయినా కుంభమేళాకు ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే చాలు. మూడు రోజులు, నాలుగు రోజులు అంటూ అంత రద్దీలో ఇబ్బందిపడేకన్నా ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కుంభమేళాకి హాజరవడం వెనుకున్న అసలైన ఉద్దేశం త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడంమే. అందుకే వెళ్లామా..పుణ్యస్నానం ఆచరించామా..వెంటనే బయలుదేరి వచ్చేశామా అన్నట్టుండాలి ప్లాన్. అందరూ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత రద్దీ అయినా కానీ ఎలాంటి ప్రమాదాలు, తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు మీవంతు మీరు ప్రయత్నం చేస్తున్నట్టే.
Also Read: తీర్ధ, ఆనంద, హంస.. సన్యాసులకు, అఘోరాలకు ఈ పేర్లు ఎవరిస్తారు? దశనామి సంప్రదాయం అంటే ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైన తర్వాత రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోంది. లెక్కలేనంత మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభస్నానం చేసేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీ భక్తులు కూడా తరలివస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం మొత్తం జాతరను తలపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో ఏర్పాట్లు,భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ప్రయాణం సులభంగా ఉండడమే కాదు..మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీవంతు సహకారం అందినట్టవుతుంది.
సింగిల్ డే కుంభమేళాకి వచ్చేవారు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
మీకు అత్యవసరం అయిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. ఘాట్ వద్దకు వాహనాలు తీసుకెళ్లే సౌకర్యం లేదు అందుకే మోసుకెళ్లే వస్తులను తగ్గించుకోండి. ఒంటరిగా వెళ్లాల్సి వస్తే మీ సామాన్లతో చాలా దూరం నడవాల్సి వస్తుంది..నదిలో స్నానానికి దిగేటప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ప్రయాగరాజ్ కు వెళ్లిన చాలామంది భక్తుల సమాన్లు మిస్సయ్యాయి. కుంభమేళాకి వెళ్లి స్నానం ఆచరించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకోండి. కుంభమేళాలో టెంట్ సౌకర్యం ఉంది కానీ అది చాలా ఖరీదైనది. ఇక టెంట్ ఖరీదైనది అంటే ఇక హోటళ్లు కూడా ఎంత ఖరీదైనవి అవుతాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయాన్నే అక్కడకు చేరుకుని తిరిగి ఈవెనింగ్ అక్కడి నుంచి మూవ్ అవడం మంచిది. తప్పనిపరిస్థితుల్లో కుంభమేళాలో నైట్ స్టే చేయాల్సి వస్తే.. మీతో పాటు శాలువా , షీట్లు ఉండేలా చూసుకోండి. నిద్రపోయేందుకు స్థలం దొరకనప్పుడు ఏదో మూలన మీ శాలువా మీరు కప్పుకుని పడుకోవచ్చు. లేదు హోటల్ కి వెళ్లాల్సిందే అనుకుంటే మాత్రం..ప్రయాగరాజ్ నుంచి కొంచెం దూరం వచ్చి ట్రై చేస్తే బటర్.
జనవరి 13 భోగిరోజు ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగుతుంది..
Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్లో ఎలా కవర్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి