జనవరి 22 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు స్నేహితులతో ఒక ప్రత్యేక సమయాన్ని ఆస్వాదిస్తారు. వైవాహిక సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ భాగస్వామికి తగినంత సమయం ఇవ్వండి. అన్ని పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు
వృషభ రాశి
ఈ రోజు సృజనాత్మక అభిరుచులు పెరుగుతాయి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. కోరుకున్న పని పూర్తవుతుంది.. రోజంతా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
ఈ రోజు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తారు. పొట్టకు సంబంధించిన సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మనసులో తెలియని భయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
Also Read: తిరుమల శ్రీవారి అన్నప్రసాద మెనూలో మార్పులు.. కొత్తగా చేరిన ఐటెమ్ ఏంటో తెలుసా!
కర్కాటక రాశి
సమయం దుర్వినియోగం చేయడం వల్ల అధికారులు మీపై కోపం తెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. మీ శ్రేయోభిలాషులు ఎవరో , శత్రువులు ఎవరో గుర్తించండి. విద్యార్థులు చదువు విషయంలో కష్టపడాల్సి వస్తుంది.
సింహ రాశి
ఈ రోజు మీ నాయకత్వ సామర్థ్యాలు ప్రశంశలు అందుకుంటాయి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.
కన్యా రాశి
ఈ రోజు మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని పొందుతారు. తీవ్రమైన సమస్యలపై ఆలోచించిన తర్వాతే స్పందించాలి. కళారంగంతో సంబంధమున్న వ్యక్తులకు ప్రశంసలు లభిస్తాయి. మీరు ఇంటిని పునరుద్ధరించడానికి డబ్బు ఖర్చు చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఒత్తిడి ఉంటుంది
Also Read: జనవరి 29 మౌని అమావాస్య..ఈ రోజు రావిచెట్టు దగ్గర దీపం వెలిగిస్తే!
తులా రాశి
ఈ రోజు మీ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ముఖ్యమైన అంశాలకు సంబంధించి గందరగోళం తలెత్తవచ్చు. సమస్యలకు పరిష్కారాలు వెతికే పనిలో నిమగ్నమై ఉంటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది
వృశ్చిక రాశి
ఈ రోజు మీ గొప్పను ప్రదర్శించేందుకు ఖర్చు చేస్తారు. ఏ పనైనా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని చేయండి. రాత్రి పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని స్మరణ చేయండి. సూటిగా మాట్లాడొద్దు. కుటుంబ వాతావరణం సంతోషాన్నిస్తుంది
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు క్రమశిక్షణకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. వైవాహిక సంబంధాలలో మాధుర్యాన్ని కాపాడుకోండి. మీరు చేపట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైనవారికి మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి సమయం.
మకర రాశి
ఈ రోజు కార్యాలయంలో అధికారులతో మీ సమన్వయం అద్భుతంగా ఉంటుంది. మీరు రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తండ్రి సలహా తీసుకోవడం మేలు చేస్తుంది.
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల మాటలు మిమ్మల్ని బాధపెడతాయి. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా స్నేహం చేయవద్దు. ఎవర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. చట్టపరమైన విషయాలలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి
మీన రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రియమైనవారి ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. అశాంతిగా అనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. మీరు సహోద్యోగులతో మీ సంబంధాలను కాపాడుకోండి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.