Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదం అందించేందుకు TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం భక్తులకు అందుబాటులో ఉంది . ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణలో భాగంగా 44 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు అందించిన దాతలు తామే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. అన్నప్రసాదానికి విరాళం అందించేవారి పేరు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని ఉన్న కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4 , పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా హాస్పిటల్, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తారు. ఇంకా వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్ లతో పాటూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లున్నాయి.
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!