Common Management Admission Test (CMAT) Admitcard: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్‌) అడ్మిట్‌ కార్డులను జనవరి 21 విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. సీమ్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు, ఇతర వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థుల ఫోటో, సంతకం, బార్‌కోడ్ వీటిలో ఏది సరిగా లేకపోయిన అడ్మిట్‌ కార్డు చెల్లుబాటు కాదని తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

సీమ్యాట్‌ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా జనవరి 25న 107 నగరాల్లో కంప్యూటర్‌ ఆధారిత విధానంలో రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.  దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు సీమ్యాట్ పరీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ పరీక్షలో  వచ్చే  స్కోరు  ఆధారంగా 2025-2026 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా దాదాపు 1000 మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు.  

సీమ్యాట్ 2025 అడ్మిట్ కార్డు కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..➥ మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 80 మార్కులు కేటాయించారు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 5 విభాగాల సెనుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.

➥ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు-80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు-80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-80 మార్కులు, ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ 20 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు ఒక సమాధానం మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ జవాబులు గుర్తించిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కులు ఇస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.

ALSO READ:

'నీట్‌' ప్రవేశ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం, ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్ష నిర్వహణదేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET-UG) పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగా పేపర్‌ లీక్‌ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిన్నమొన్నటి వరకు భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై యూటర్న్‌ తీసుకుంది. నీట్ పరీక్షను ఆన్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని చివరకు నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పెన్‌-పేపర్‌ (OMR based) విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీలో దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..