మేషరాశి
మేషరాశి వారు ఈ రోజు కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభసమయం. సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం బాధిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. 
వృషభం
ఓ పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి రావొచ్చు. తొందరపాటు వద్దు, ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది.  వ్యాపార ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఒకరి ప్రవర్తన కారణంగా బాధపడతారు. ఉద్యోగంలో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. ప్రాయాణ ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది. 
మిథునం
తొందరపాటు వద్దు. శారీరక నొప్పి పనికి ఆటంకం కలిగిస్తుంది. ఊహించని లాభాలు ఉండొచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టేందుకు తొందరపడకండి. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. 
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
కర్కాటకం
శుభ కార్యాల నిర్వహణకు ప్రాణాళికలు వేస్తారు. వ్యాపారం బాగానే ఉంటుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహం
చెడు వార్తలు వినే అవకాశం ఉంది.  కుటుంబంలో ఆందోళనలు అలాగే ఉంటాయి. శ్రమ ఎక్కువ లాభం తక్కువ ఉంటుంది. ఇతరుల నుంచి ఏమీ ఆశించవద్దు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. భాగస్వాముల నుంచి సహకారం ఉండదు. వ్యసనాలకు దూరంగా ఉండండి  ఆదాయం నిలకడగా ఉంటుంది.
కన్య
చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. తెలివైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. తొందరపాటు వద్దు. మీ ప్రయత్నం విజయవంతమవుతుంది.  ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
తుల
కొత్త పనులు కలిసొస్తాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మాటలు అదుపులో ఉంచుకోండి. ప్రమాదకర పనులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. పనుల్లో వేగం మందగిస్తుంది. విద్యార్థులు లాభపడతారు. ఒత్తిడికి అవకాశాలు ఉండొచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
వృశ్చికం
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది.  దురాశ వద్దు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ కార్నివాల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త చేయండి. ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఒత్తిడికి గురికావొద్దు. 
ధనుస్సు
వ్యాపారంలో ఆకస్మిక లాభాలుంటాయి.  భయాందోళనల కారణంగా పనిలో వేగం మందగించవచ్చు.  కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఈరోజు  ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మిత్రులను కలుస్తారు.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
మకరం
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఆస్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభసమయం. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ మద్దతు లభిస్తుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. సోమరితనం వద్దు. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక మూలాలు పెరుగుతాయి. 
కుంభం
ఏ పనిలోనూ తొందరపాటు వద్దు. నష్టాలు వచ్చే అవకాశం ఉంది.  ఈరోజంతా గందరగోళంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయండి. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది.ప్రభుత్వ పని పూర్తవుతుంది.
మీనం
విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. టెన్షన్ పెరుగుతుంది. తెలియని వ్యక్తుల నుంచి హాని ఉండొచ్చు.  సామాజికంగా మీకు గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. అధికారులతో సమావేశమవుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. 
Also Read:నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read: కాశీకి ఎందుకెళతారు….అక్కడ ఏం వదిలేయాలి?
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి