మేషం
సామాజిక సేవపై ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. శత్రువులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
వృషభం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి లాభం పొందుతారు. అనవసర మాటలు వద్దు.  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. అప్పుల కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథునం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటారు. కుటుంబ సమస్యల కారణంగా ఆందోళన పెరుగుతుంది. కార్యాలయంలో పరిస్థితులు కలిసొస్తాయి.  సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. భాగస్వాముల సహకారంతో చేపట్టిన  పనులు వేగవంతమవుతాయి. శత్రువులు చురుగ్గా ఉంటారు. పాత వ్యాధి తిరిగి రావచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
కర్కాటకం
కొత్త సమస్య తలెత్తుతుంది. తెలియని అడ్డంకి ప్రభావం మీ పనిపై పడుతుంది. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూల సమయం.
సింహం
ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. బంధువులను కలుస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుకుంటారు.  పార్టీల్లో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూలసమయం.
కన్య
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పాత వ్యాధి తిరిగబెట్టొచ్చు. దుర్వార్తలు వినే అవకాశం ఉంది. ప్రమాదకరమైన పనులు చేయొద్దు. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. మీకు తెలియని వ్యక్తిని నమ్మొద్దు. వ్యాపారం బాగా సాగుతుంది.ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  కార్యాలయంలో శుభవార్త వింటారు.
Also Read:  దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది .. బండ్ల గణేష్ ట్వీట్ లో ఏముంది..వాస్తవం ఏంటి..!
తుల
ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు. టెన్షన్ తగ్గుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. తొందరపాటు వద్దు.
వృశ్చికం
అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోమరితనం విడనాడాలి. ఓ వ్యక్తి ప్రవర్తన వల్ల బాధపడతారు. అతిథులు ఇంటికి వస్తారు. శుభవార్త వింటారు. పూర్వీకుల ఆస్తి సమస్యలు తీరే అవకాశం ఉంది. కొన్ని పనులు చేయడానికి ప్రణాళికలు వేసుకోండి. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆకస్మిక పర్యటనలు ఉంటాయి.
ధనుస్సు
ఈరోజు కొంత నష్టపోతారు. చేపట్టిన పనిలో అడ్డంకి ఉండొచ్చు. శారీరక నొప్పితో ఇబ్బంది పడతారు. ఊహించని ఖర్చులుంటాయి. అనవసర మాటలు వద్దు. అపరిచితులతో అనవసర చర్చలు పెట్టుకోపోవడం మంచింది. లావాదేవీల విషయంలో తొందరపడకండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 
Also Read: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!
మకరం
వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారస్తులకు శుభసమయం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభం
యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో సమయం గడుపుతారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అన్ని వైపుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఉంటాయి.  విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటపై సంయమనం పాటించండి. దూషించే పదాలను ఉపయోగించవద్దు. 
మీనం
లావాదేవీల విషయంలో తొందరపడకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. టెన్షన్ తగ్గుతుంది. వాహనాలు, యంత్రాల వాడకంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. 
Also Read: ఇదింతే అనే ఆలోచన మార్చుకోకుంటే ఏమవుద్ది.. వచ్చే సమస్యలేంటి? కేరీర్ గ్రోత్‌కి దీనికి లింకేంటి
Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి