మార్చి 20 ఆదివారం రాశిఫలాలు


మేషం
విద్యార్థులు తమ వృత్తి, ఉన్నత చదువుల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు. కొత్త కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. మీ ఖర్చులను నియంత్రించుకోండి.


వృషభం 
ఈరోజంతా కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కొత్త ఉద్యోగం మారాలి అనుకునేవారికి అనుకూల సమయం. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు, ప్రయాణాలు వాయిదా పడొచ్చు.మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


మిథునం 
భారీ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో ఇబ్బంది ఉంటుంది. ఈరోజు మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు సాగుతాయి. ఆధ్యాత్మికతవైపు మనసు మళ్లుతుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఈరోజు మీకు మంచి రోజు.


కర్కాటకం
ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది.  విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  కొన్ని కారణాల వల్ల ఇంట్లో గొడవలు రావచ్చు.మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు మేలు జరుగుతుంది.


Also Read: రామాయణం, మహాభారతం, భాగవతం ఈ ఒక్క శ్లోకంలో చదివేసుకోండి


సింహం
 మీ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పాత స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. సీనియర్లతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ దినచర్య బాగుంటుంది. యోగా వ్యాయామం పట్ల ఆసక్తి చూపుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. 


కన్య
అప్పచ్చిన రుణం తిరిగి పొందడం కష్టంగానే ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.  క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసేందుకు ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


తుల
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈరోజు బాగానే ఉంటుంది.  వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.  న్యాయపరమైన అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.


వృశ్చికం 
ఈరోజు మీరు కొన్ని సమస్యలతో బాధపడతారు.  వాహనం జాగ్రత్తగా నడపండి. ఎవరి నుంచీ అతిగా ఆశించవద్దు. ఇంట్లో ఇబ్బంది వాతావరణం ఉంటుంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురవుతారు. నలుగురి మెప్పుకోసం ఖర్చు చేయవద్దు.
 Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?


ధనుస్సు
కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ పని తీరు మారుతుంది. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. ఈ రోజంతా బాగానే ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. కలిసి పనిచేసే వారి ప్రవర్తన మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ప్రేమికుల అనుబంధం దృఢంగా ఉంటుంది.


మకరం
 ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. 


కుంభం
దంపతుల మధ్య కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి. తెలియని వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడవద్దు. ఆలోచనల్లో ప్రతికూలత ఉంటుంది. ఈరోజు సాధారణ రోజు అవుతుంది.


మీనం 
మీరు ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్త. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు ప్రభావితం అవుతాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయకండి. కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.