ఫిబ్రవరి 13 ఆదివారం రాశిఫలాలు
మేషం ( Aries)
కార్యాలయంలో మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది. దాంపత్య జీవితం బావుంటుంది.  కొత్త స్నేహితులు ఏర్పడొచ్చు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. 


వృషభం (Taurus)
మీరు గత అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆలోచనల్లో ప్రతికూలతను తగ్గించుకోండి. వృద్ధులకు సహాయం చేస్తారు. ఒంటరిగా సమయం గడుపుతారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకునేవారి ఇదే మంచి సమయం.


మిథునం (Gemini)
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈరోజు కొన్ని పనుల విషయంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.  అనుమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  చాలారోజులగా నిలిచిన మొత్తాన్ని పొందుతారు.  తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.


కర్కాటకం ( Cancer)
వైవాహిక సంబంధాల్లో సందేహాలు తలెత్తవచ్చు. విద్యార్థులు తమ చదువుల గురించి ఆందోళన చెందుతారు. వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఏ విషయంలోనూ మొండిగా ఉండకండి.ఎక్కువ ఖర్చు చేయడం వల్ల సమస్యలు వస్తాయి.


సింహం (Leo)
వ్యాపారంలో లాభం ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పార్టీల్లో పాల్గొంటారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. మీ పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నించండి. అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకండి.
 
కన్య  (Virgo)
మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని తప్పులు చేసే దిశగా మనసు మళ్లుతుంది..ముందుగానే గ్రహించి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా చురుకుగా ఉండవచ్చు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రయాణం వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. 


Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...
తుల ( Libra)
కార్యాలయంలో నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు తమ కెరీర్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
 
వృశ్చికం (Scorpio)
మీరు ఇంతకుముందు తీసుకున్న తప్పుడు నిర్ణయం మీకు హాని కలిగించవచ్చు. కుటుంబంలో కలహాల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో సమస్య ఉంటుంది.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. బదిలీ జరగవచ్చు.


ధనుస్సు ( Sagittarius)
సమాజంలో మీ హోదా పెరుగుతుంది. వైవాహిక బంధం బలపడుతుంది. వ్యాపారంలో పెద్ద డీల్ ఉంటుంది.అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. అప్పిచ్చిన మొత్తం తిరిగి వస్తుంది. ఈరోజు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. 


మకరం ( Capricorn )
ఆదాయం పెరుగుతుంది. బంధువుల రాక కోసం ఎదురు చూస్తారు. కుటుంబ సహకారం లభిస్తుంది. అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు విద్యకు సంబంధించిన పనుల్లో విజయం పొందవచ్చు. మీరు సంతోషం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. 


కుంభం ( Aquarius)
ఆఫీసులో కలిసి పనిచేసే వారితో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఏ నిర్ణయానికైనా ఈరోజు ముఖ్యమైనదని నిరూపించుకుంటారు. 


మీనం ( Pisces)
ఈ రోజు అసంపూర్ణమైన రోజు అవుతుంది. మీకు ఏ పని చేయాలని అనిపించదు. విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కొన్ని వ్యాధులతో బాధపడతారు. వైరాగ్య భావాలు ఉంటాయి. ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వకండి. అభద్రతా భావం ఉంటుంది.


Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..