Matangeshwar Temple Mystery: మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి..ఆయా ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. ఆధునికే పరిజ్ఞానం ఎంత పెరిగినా ఆ రహస్యాలను చేధించలేకపోయారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా పుణ్యప్రదేశాల్లో ఉన్న రహస్యాలను తెలుసుకోలేకపోయారు. అలాంటి ఓ ఆలయం మధ్యప్రదేశ్ ఖజురహోలో ఉంది. అదే మాతంగేశ్వర లేదా మృత్యుంజయ మాహాదేవ్ ( Matangeshwar Temple, Khajuraho) ఆలయం .
ఖజురహో అంటే అక్కడ శిల్పసంపద కళ్లముందు కనిపిస్తుంది...కానీ ఇక్కడున్న మాతంగేశ్వర మహాదేవ ఆలయంలో శిల్పకళతో పాటూ ఓ రహస్యం కూడా దాగి ఉంది. ఈ ఆలయంలో శివలింగం కింద 18 అడుగుల లోతున విలువైన నిధి ఉందట. ఈ నిధిని రుషులు, దైవిక శక్తులు కాపలా కాస్తున్నాయని స్థానిక ప్రజల విశ్వాసం. మరో అంతుచిక్కని రహస్యం ఏంటంటే ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఇందుకు కారణం ఏంటన్నది తెలుసుకోలేకపోయారు. ఇది దైవిక ఘటన అని కొందరు..భౌగోళిక కారణాలున్నాయని మరికొందరు చెబుతారు.
ఖజురాహోలో పశ్చిమ దేవాలయాల సమూహానికి సమీపంలో ఉన్న ఈ మాతంగేశ్వర మహాదేవ ఆలయం మిగిలిన దేవాలయాల కన్నా భిన్నంగా ఉంటుంది. మాతంగేశ్వర మహాదేవ ఆలయాన్ని 9-10 శతాబ్దంలో చందేలా పాలకులు నిర్మించారు. ఖజురాహోలోని ఇతర దేవాలయాల్లానే మాతంగేశ్వర ఆలయం కూడా నాగర్ శైలిలో నిర్మించారు. నిత్యం ఈ ఆలయంలో భక్తుల సందడి కొనసాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం మాత్రేమ కాదు మానసిక ప్రశాంతతను అందిస్తుందంటారు భక్తులు.
ప్రస్తుతం తొమ్మిది అడుగులు ఎత్తున్న ఈ శివలింగం 18 అడుగులు ఎత్తుకి చేరేసరికి యుగాంతమే అనే ప్రచారమూ ఉంది. ఈ శివలింగానికి 18 అడుగుల లోతులో విలువైన నిధి ఉందని చెబుతారు కానీ ఈ వాదనలు నిజం అని చెప్పేలా కచ్చితమైన ఆధారాలు లేవు. ఓ తరం నుంచి మరోతరం ఈ నమ్మకాలను అనుసరిస్తూ సాగిపోతున్నారు.
ఏటా శివరాత్రి సమయంలో మాతంగేశ్వర మహాదేవ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. శివకళ్యాణం కన్నులపండువగా జరిపిస్తారు. శివకళ్యాణం రోజు 25వేలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ వేడుకలో భాగంగా శివలింగానికి అభిషేకం నిర్వహించి వరుడిలా అలంకరిస్తారు. దాదాపు 10 రోజుల పాటూ ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రం నుంచి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ సమయంలో హస్తకళలు, గ్రామీణ సర్కస్ ప్రదర్శనలు , సంగీత ప్రదర్శనలు, జానపద నాటకాలు ప్రదర్శిస్తారు.
ఈ ఆలయానికి సమీపంలో చాలా దర్శనీయ ప్రదేశాలున్నాయి. అవే లక్ష్మణ దేవాలయం, వరాహ మందిరం, పార్వతీ ఆలయం, లక్ష్మీ మందిరం, ప్రతాపేశ్వర ఆలయం, పురావస్తు మ్యూజియం, విశ్వనాథ ఆలయం ఉన్నాయి.
షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి