2025 జూన్ 13 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 13th 2025

మేష రాశి , 13 జూన్ 2025

ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థి ఇబ్బందులు తీరిపోతాయి. పిల్లల గురించి కొంత ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామి సహాకారంతో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వృషభ రాశి , 13 జూన్ 2025

ఈ రోజు మిమ్మల్ని మీరు తప్పుదోవపట్టించుకుంటారు. నూతన వ్యవహారాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిదికాదు. విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. గుండె రోగులకు సమస్యలు ఉండొచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలకు అనుకూలంగా ఉంటుంది

మిథున రాశి, 13 జూన్ 2025

మీరున్న రంగంలో మీ పనితీరు బావుంటుంది. వ్యాపారంలో మీ శైలిలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. దగ్గర వ్యక్తులతో ఓ రచ్చ మిమ్మల్ని బాధపెడుతుంది. 

కర్కాటక రాశి, 13 జూన్ 2025

ఈ రాశివారు వివాహం గురించి ఆందోళన చెందుతారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. ఈరోజు అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఆరోగ్యం బావుంటుంది

సింహ రాశి , 13 జూన్ 2025 

ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ సంబంధాల గురించి భావోద్వేగానికి గురవుతారు. కుటుంబంలో పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు అధిగమిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో వాతావరణం రిలాక్స్ గా ఉంటుంది

కన్యా రాశి ,  13 జూన్ 2025

ఈ రోజు కోపం కారణంగా మీ దగ్గర సంబంధం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గించుకోవద్దు. రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉండేవారికి ఈ రోజు అంత మంచి ఫలితాలు లేవు.. అజాగ్రత్తగా ఉండొద్దు.

తులా రాశి , 13 జూన్ 2025 

ఈ రోజు ఈ రాశి రాజకీయ నాయకులకు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి..కానీ మీరు తెలివిగా ఎదుర్కొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలకు కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కెరీర్లో కొత్త ఎంపికలు మీ ముందుకి వస్తాయి.

వృశ్చిక రాశి, 13 జూన్ 2025

ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకుకు సంబంధించిన పనిలో మందిగింపు ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. ఈ రోజు మీరు నిరాశలో ఉంటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు

ధనస్సు రాశి , 13 జూన్ 2025 

ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఈ రోజు ప్రారంభిస్తారు. వ్యాపారంలో వచ్చే సమస్యలను అధిగమిస్తారు. ఉన్నత అధికారుల సలహా ద్వారా ఉద్యోగులు మంచి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మకర రాశి, 13 జూన్ 2025 

ఈ రోజు మీపై మీరు తీవ్ర విశ్వాసం కారణంగా పెద్ద తప్పులు చేస్తారు. ఉద్యోగంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పొట్టకు సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది

కుంభ రాశి , 13 జూన్ 2025

ఈ రోజు  అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ ప్రవర్తనను సహోద్యోగుల పట్ల మంచిదా ఉంచండి. వ్యాపారులు వృద్ధి కోసం కొన్ని మార్పులు చేయవచ్చు. మీ చుట్టూ ఉన్న స్వార్థపరులకు దూరంగా ఉండండి.

మీన రాశి, 13 జూన్ 2025

మీ గౌరవం పెరుగుతుంది. మీరిచ్చే సలహాలు సూచనలు అందరూ అనుసరిస్తారు. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. సంతోషంగా ఉంటారు.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.