నవగ్రహాల్లో ఏ గ్రహం ఆరాధన వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది



  • సూర్యుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి

  • చంద్రుడిని ఆరాధిస్తే మనోధైర్యం పెరుగుతుంది

  • బుధ గ్రహాన్ని ఆరాధిస్తే చక్కటి విద్య వస్తుంది

  • కుజ గ్రహం శరీరంలో మలినం, విష పదార్థాలు తొలగిస్తుంది

  • గురుగ్రహాన్ని సేవిస్తే శుభాలే వింటారు

  • శుక్రుడిని ఆరాధిస్తే సుఖసంతోషాలతో ఉంటారు

  • శనిని పూజిస్తే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉంటారు

  • రాహుగ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యం తొలగిపోతుంది

  • కేతువుని సేవిస్తే సంపదలు, సౌఖ్యాలు లభిస్తాయి


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం చదవాల్సిన శ్లోకం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||


చంద్రుడు 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||


కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||


గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||


శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||


శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||


రాహు 
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||


కేతు 
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||


నవగ్రహాల ఆరాధన వల్ల మంచే జరుగుతుంది కానీ చెడుమాత్రం జరగదన్నది పండితుల మాట. నిత్యం ఈ శ్లోకం మొత్తం చదువుకుంటే చాలామంచిదని లేదంటే మీ గ్రహస్థితిని బట్టి అవసరమైన శ్లోకం చదువుతున్నా చాలంటారు. 


Also Read: ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి