రోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో తెలిసిందే. ఇలాంటి సమయంలో మనం తప్పకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. లేకపోతే.. కరోనా చుక్కలు చూపిస్తుంది. అయితే, తాజా స్టడీలో కరోనాకే చుక్కలు చూపించే ‘మందు’ను పరిశోధకులు కనుగొన్నారు. అదే.. రెడ్ వైన్. ఔనండి.. మీరు చదివింది కరెక్టే.. రెడ్ వైన్‌తో కరోనాతో పోరాడగలిగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చట. 


శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఆల్కహాల్ ఎలా సహాయపడుతుందో తెలుసుకొనేందుకు చైనాలోని షెన్‌జెన్ కంగ్నింగ్ హాస్పిటల్‌లోని పరిశోధనా బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ వివరాలను ఇటీవలే సైంటిఫిక్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా రెడ్ వైన్, వైట్ వైన్, షాంపైన్‌లను ఇష్టపడే వ్యక్తులకు కోవిడ్ -19 వచ్చే అవకాశాలు తక్కువని కొనుగొన్నారు. ముఖ్యంగా  రూజ్ వినో(Rouge vino) అనే వైన్.. అన్నిటికంటే ఎక్కువ సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. 


ఈ అధ్యయనంలో దాదాపు 500,000 మందిని పరీక్సించారు. అయితే, వీరిలో 16,500 మందికి పైగా కోవిడ్-19కు గురయ్యారు. పరిశోధకులు ఆల్కహాల్ వినియోగాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. 14 యూనిట్ల కంటే తక్కువ ఆల్కహాల్ తాగేవారు, 14 కంటే ఎక్కువ తాగేవారు, 28 కంటే తక్కువ, రులు 28 కంటే ఎక్కువ యూనిట్లు తాగేవారిని వేర్వేరుగా పరీక్షించారు. రెడ్ వైన్‌తోపాటు బీరు తదితర ఆల్కహాళ్లను తాగేవారిపై కూడా ఓ కన్నేశారు. 


వారానికి ఒకసారి రెడ్ వైన్ తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తగ్గినట్లు కనుగొన్నారు. బీర్ లేదా పండ్ల రసాల తరహా ఆల్కహాల్‌ను తీసుకొనేవారిలో మాత్రం సత్ఫలితాలు కనిపించలేదు. ఒక రకంగా బీరు ప్రియులకు ఇది బ్యాడ్ న్యూసే. అధ్యయనంలో పేర్కొన్న అంశాల ప్రకారం.. రెడ్ వైన్, వైట్ వైన్, షాంపైన్‌లను వారానికి 1-2 గ్లాసుల చొప్పు తాగేవారిలో కోవిడ్-19 తగ్గించే అవకాశాలు కనిపించాయి. కానీ.. బీర్, పండ్ల రసాలతో తయారయ్యే ఆల్కహాల్స్ మాత్రం కోవిడ్-19 ప్రమాదాన్ని పెంచేసింది. వీటిని అతిగా తీసుకొనేవారు త్వరగా అనారోగ్యానికి గురవ్వుతారు. కాబట్టి.. వీటిని ఎట్టి పరిస్థితుల్లో సిఫార్సు చేయలేమని అధ్యయనంలో స్పష్టం చేశారు. 


రెడ్ వైన్, బీర్ మధ్య తేడాను విశ్లేషించినప్పుడు.. కొన్ని సామాజిక అంశాలు కూడా కోవిడ్-19 విస్తరణకు కారణం కావచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. ఎందుకంటే.. రెడ్ వైన్‌ను ఎక్కువగా ఇళ్లల్లో ఉండే తాగుతారు. కానీ, బీర్ వంటి ఆల్కహాళ్లు తాగేవారు పబ్‌లో అందరి మధ్య, గ్లాసుల్లో తాగేందుకు మొగ్గు చూపుతారు. ఇది కూడా కోవిడ్-19కు కారణం కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. మితిమీరిన మద్యం తాగడం మంచిది కాదని, ఆల్కహాల్ మిమ్మల్ని కరోనా నుంచి రక్షిస్తుందనే భావనతో తాగేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.


గమనిక: అధ్యయనంలోని వివరాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనంలో పేర్కొన్న అంశాలతో ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్‌’ బాధ్యులు కాదని గమనించగలరు.