గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్


ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు డైటీషియన్ తో మాట్లాడుతున్నారు కదా అన్నీ అలా తెలిసిపోతాయంతే అంటాడు. నువ్వు కనిపించడం లేదేంటి గౌతమ్ అన్న ధరణితో..ఓ పనిపై చాలా బిజీగా ఉన్నానంటాడు. రిషి ఎటెళ్లాడో మీకు తెలుసా...అని అడిగి..మీకు చెప్పడులే నాకు తెలుసు..వాడొక అంతుపట్టని బెస్ట్ ఫ్రెండ్ నాకు అని అడిగి... ఈ సంక్రాంతి పండుగకు నా ఫ్రెండ్ ని ఇంటికి లంచ్ కి పిలవొచ్చా అంటాడు. పెద్దమ్మకి మీరు రికమెండ్ చేయొచ్చు కదా అంటే ఫ్రెండ్ ఎవరో చెప్పు అన్న ధరణితో..వసుధార పేరు చెప్పి షాకిస్తాడు. దేవయానికి అత్తయ్యకు వసుధార అంటే కోపం, అస్సలు ఒప్పుకోరు అని చెబుతుంది ధరణి. పెద్దమ్మకి ఎందుకు కోపం మన రిషి గాడికి ఆ అమ్మాయి లైన్ వేస్తోందనా..అయినా పెద్దమ్మ భయంలో అర్థం లేదు మనవాడి సంగతి తెలుసుకదా..వీడి దగ్గరకు రావడానికే అమ్మాయిలు భయపడతారు.. అంత సీరియస్ గా ఉంటాడంటాడు గౌతమ్. రిషి చాలా మంచోడు అన్న ధరణితో..మంచితనం చూపించలేం కదా అని గౌతమ్..చెడ్డగుణం చూపించకపోయినా తెలిసిపోతుంది కదా అని ధరణి అంటారు. ఏదేమైనా పండుగకు వసుధారతో కలసి లంచ్ చేయడం ఖాయం అనేసి వెళ్లిపోతాడు. గౌతమ్ దూకుడు చూస్తుంటే రిషికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాడే ఏం చేయాలి అనే ఆలోచనలో పడుతుంది ధరణి.


Also Read: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
కార్లో వసుధారని బయటకు తీసుకెళ్లిన రిషి.. నాకో హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. నేను మీకు హెల్ప్ చేయడం ఏంటని అడిగితే..ఇది నువ్వు మాత్రమే చేయగలవు అంటూ ఏదో చెబుతాడు ( ఆ మాటలు మనకు వినిపించవు).  అంతా విన్న వసుధార సారీ సార్..నేను ఈ పని చేయలేను..ఇది నా వల్ల కాదు అంటుంది. వల్ల కాకపోవడం ఏంటన్న రిషితో..మీరు నన్ను అడగాల్సింది కాదు సార్ నేను చేయలేను అంటుంది. సార్ దీనికి సాయం అన్నమాట సరిపోదు..నా పరిధిలో లేనిది, నా స్థాయికి మించినది మీరు అడిగారు అనగానే..అడిగినప్పుడు చేయాలి కదా అన్న రిషితో.. నా వల్ల కాదు సార్ అనేస్తుంది. ఎప్పుడూ ఏదీ అడగలేదు కదా.. ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా అని అసాధ్యమైన దాన్ని అడిగితే నేను చేయలేను అని క్లియర్ గా చెబుతుంది. రిషి ఎంత చెప్పినా వసు మాత్రం అదే మాట చెబుతుంది. నాకు తెలుసు, నాకు ఎవ్వరూ హెల్ప్ చేయరు..నేనెప్పుడూ ఒంటరి వాడినే అని బాధపడుతున్న రిషిని చూసి..ఈ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ చేయలేను అనేస్తుంది. 


Also Read:  తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్న మహేంద్రతో..ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతాడు ఫణీంద్ర. ఈ సారి పండుగ ఎలా చేసుకుందాం అని గౌతమ్ అడిగితే..మహేంద్ర పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు సంక్రాంతి అదిరిపోతుంది అంటాడు. జగతి లేని ఇంట్లో ఏ పండుగ జరిగినా నాకు పండుగ కాదని మనసులో అనుకుంటాడు మహేంద్ర. రిషి కనిపించడం లేదేంటి.. ఇంట్లో ఉంటే బయటకు వచ్చేవాడు కదా అంటాడు గౌతమ్. కట్ చేస్తే..ఇంట్లో కూర్చున్న వసుధార..రిషి తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది. కాఫీ కావాలా అని జగతి అడిగతే ఇవ్వండి అని ఒకసారి, వద్దు అని మరోసారి అనడంతో..ఏంటి కన్ఫ్యూజన్ అని అడుగుతుంది. పొద్దున్నే ఇలా ఉన్నావేంటి అని జగతి అడిగినా ఏమీ మాట్లాడదు వసుధార. 


Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
ఇంతలో ఇంటికి వచ్చిన రిషి లోపలకు రావొచ్చా అని అడుగుతాడు. జగతి..రిషిని సంతోషంగా చూస్తే.. రిషి మాత్రం వసుధారని కోపంగా చూస్తాడు. కాఫీ తీసుకురా అని చెప్పడంతో వసు అక్కడి నుంచి వెళుతుంది. పొద్దున్నే కాఫీ కోసం రాలేదని చిరాకుగా చెప్పిన రిషి...మీరు నాకో హెల్ప్ చేయాలి మేడం అంటాడు. చెప్పండి సార్ అని జగతి అడుగుతుంది. మా డాడ్ సంతోషమే నాకు ముఖ్యం.. ఆయన ఆనందం ముందు నాకేదీ ముఖ్యం కాదు ( గతంలో మా డాడ్ ని వదిలేసి వెళ్లడానికి ఎంత కావాలి అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది జగతి) ఆయన సంతోషంగా ఉండాలి అందుకు మీరొక పనిచేయాలి మేడం అంటాడు రిషి. ఏమైనా చేస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్లిపోమని కాకుండా మీరు ఏం చెప్పినా చేస్తాను అన్న జగతితో..నేను చెప్పింది మీరు కాదనకూడదు అనే కండిషన్ పెడతాడు. ఇక్కడి నుంచి వెళ్లమనడం కాకుండా ఏం చెప్పినా చేస్తానని మరోసారి క్లారిటీ ఇస్తుంది జగతి. మీరు ఇక్కడి నుంచి వెళ్లాలి అని గ్యాప్ ఇచ్చి... మా డాడ్ సంతోషం కోసం మా ఇంటికి రావాలి అని కంప్లీట్ చేస్తాడు. అది విన్న జగతి, వసు ముఖాలు వెలిగిపోతాయి. సార్..ఇక్కడి నుంచి వెళ్లాలి అంటే ఆ ఇంటికి వెళ్లాలన్నట్టు అని చెబుతాడు. అప్పటికీ నమ్మలేని జగతి నేను ఆ ఇంటికి నా ఇంటికి అని అడుగుతుంటే..అవును మేడం మా ఇంటికి రావాలి అంటాడు. నన్నింటికి పిలుస్తున్నారా అని ఎగ్జైట్ అవుతుంది. మా ఇంటికి రావాలి మా డాడ్ సంతోషం కోసం.. మా డాడ్ ఆనందం కోసం రావాలి అంచాడు..


Also Read: ఎందుకిలా చేశారంటూ కార్తీక్ ని కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన దీప.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్….
రేపటి ఎపిసోడ్ లో
 కార్లోంచి దిగిన జగతి చూసి షాక్ అయిన దేవయాని....రిషి నువ్వేం చేస్తున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది. నేనే తీసుకొచ్చానన్న రిషి..అంతా తర్వాత చెబుతా అనేసి లోపలకు తీసుకెళతాడు. మహేంద్ర రూమ్ డోర్ తీసి గుడ్ మార్నింగ్ డాడ్ అంటే.. మార్నింగ్ లో గుడ్ ఎక్కడుందిలే అంటాడు మహేంద్ర. ఇంతలో వెనుకే కనిపించిన జగతిని చూసిన మహేంద్ర మొహంలో ఆనందాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు రిషి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి