2025 జూన్ 12 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 12th 2025

మేష రాశి (Aries) జూన్ 12, 2025

మేష రాశి వారికి గ్రహాల స్థితి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వ్యాపారవేత్తలకు చాలా లాభదాయకంగా ఉంటుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. వృషభ రాశి (Taurus) జూన్ 12, 2025

వృషభ రాశి వారికి ఈ రోజు కొంచెం ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఖర్చు చేస్తారు. ప్రస్తుతం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి సారించండి. ఆర్థిక విషయాల్లో ఈ రోజు మీకు కొంచెం బలహీనంగా ఉంటుంది. ఈ రోజు ఏ విషయంలోనూ అతిగా ఆత్మవిశ్వాసం పెంచుకోవద్దు.  వివాహితుల జీవితంలో ఈ రోజు ఒత్తిడి కొంచెం పెరగవచ్చు.

మిథున రాశి (Gemini) జూన్ 12, 2025

మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు తక్కువ ఆర్థిక సవాళ్లు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.  వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజు చాలా బాగుంటుంది.  వివాహితులు ఈ రోజు తమ పిల్లల గురించి పెద్ద శుభవార్త వినవచ్చు.

కర్కాటక రాశి (Cancer) జూన్ 12, 2025

గ్రహాల స్థితి కర్కాటక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు ఆర్థికంగా చాలా బలంగా కనిపిస్తారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. మీ తల్లి పట్ల ప్రత్యేక అనుబంధాన్ని కలిగిఉంటారు. ఈ రోజు ఇంట్లో ఆస్తికి సంబంధించిన చర్చలు జరగవచ్చు, దీనివల్ల మీకు ప్రయోజనం కూడా కలుగుతుంది. మీ కెరీర్‌కు ఇది మంచి రోజు. వ్యక్తిగత జీవితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది.

సింహ రాశి (Leo) జూన్ 12, 2025

సింహ రాశి వారికి ఈ రోజు విదేశాల నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఓ పని కోసం సుదూర ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీకు దగ్గు, జలుబు వంటి అంటువ్యాధుల వల్ల ఇబ్బందిపడతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం మీకు హానికరం. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం ప్రేమతో నిండి ఉంటుంది, కానీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

కన్యా రాశి (Virgo) జూన్ 12, 2025

కన్యా రాశి వారు ఈ రోజు ఏ విషయంలోనూ ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. మానసికంగా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రభావం వ్యాపారంపై పడుతుంది. పని  విషయంలో మీపై పూర్తి నమ్మకం ఉంచుకోండి..మంచి ఫలితాలు పొందుతారు.

తులా రాశి (Libra) జూన్ 12, 2025

తులా రాశి వారికి ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది. ఈ రోజు మీరు పదోన్నతి పొందవచ్చు లేదా వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. జీవిత భాగస్వామిని ప్రోత్సహిస్తే వారు తలపెట్టిన పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 12, 2025

వృశ్చిక రాశి వారికి గ్రహాల గమనం ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది.  ఖర్చులు  పెరుగుతాయి ఆర్థికంగా రోజు కొంచెం నిరాశగా ఉంటుంది కానీ మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఒకేసారి చాలా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు సీనియర్ల సహకారం పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ ఈ రోజు మీరు ప్రతి సవాలును మీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 12, 2025

ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఈ రోజు వారితో మీ మనసులోని ప్రతి విషయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు . ఈ రోజు ఆదాయం పరంగా చాలా బాగుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఈ రోజు తమ ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచించవచ్చు.

మకర రాశి (Capricorn) జూన్ 12, 2025

మకర రాశి వారు ఈ రోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా పెద్ద సమాచారం పొందవచ్చు, దీనివల్ల మీరు చాలా సంతోషిస్తారు. ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్టైతే ఈరోజు మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో జరిగే చర్చలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబంలో  సమన్వయం బాగుంటుంది.

కుంభ రాశి (Aquarius) జూన్ 12, 2025

కుంభ రాశి వారికి నక్షత్రాల గమనం ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం నింపుతుంది.  వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు, కానీ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నష్టం కూడా జరగవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య వివాద సూచనలున్నాయి. ఉద్యోగస్తులు మెరుగైన పనితీరును కనబరుస్తారు.

మీన రాశి (Pisces) జూన్ 12, 2025

మీన రాశి వారికి గ్రహాల స్థితి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, దీనివల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు మీరు పెద్ద పాలసీని కొనుగోలు చేయవచ్చు లేదా ధన సేకరణ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది.  ఆస్తి లేదా వాహనం కొనడానికి చర్చలు జరగవచ్చు. ధనం వస్తుంది మరియు ఈ రోజు మీరు మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. అదృష్టం బలంగా ఉంటుంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.