జనవరి 30 ఆదివారం రాశిఫలాలు


మేషం
ఈరోజు ఏ బంధువులతో కోపంగా ప్రవర్తించకండి. వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.


వృషభం 
స్నేహితులను కలుస్తారు.  కుటుంబంలో కార్యక్రామల్లో బిజీగా ఉంటారు. ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేసే వారికి శుభవార్త అందుతుంది. మీరు ఎలాంటి ఒత్తిడి నుంచి అయినా ఉపశమనం పొందుతారు.


మిథునం
ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది. కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారులకు శుభసమయం. జీవత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 


Also Read: వసంత పంచమి ప్రత్యేకత ఇదే... వ్యాసమహర్షి ప్రతిష్టించిన సరస్వతీ నిలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే..
కర్కాటకం 
ఈ  రోజు తలపెట్టిన పనుల్లో కొంత నష్టం ఉంటుంది. ఈ రోజంతా గందరగోళంగా కొనసాగుతుంది. ప్రత్యర్థులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. 


సింహం
ఆహారంలో నియంత్రణ లేకుండా  ఉండటం మంచిది కాదు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనుమానించే ధోరణిని విడనాడాలి. మీరు మీ ప్రియమైన వారికి దూరంగా ఉండవలసి రావచ్చు. 


కన్య 
అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. చెప్పుడు మాటలు వినొద్దు..మీ మనసు చెప్పిన పని చేయండి.
 
Also Read:  ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
తుల 
మీ స్నేహితుల్లో కొందరు సరైన వారు లేరు..వారి వల్ల బాధపడాల్సి రావొచ్చు. మీ బంధువులను కలిసేందుకు వెళతారు. ఈ రోజంతా మీకు మంచి రోజే. సోదరులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది.


వృశ్చికం
ఈ రాశికి చెందిన వివాహిత వ్యక్తుల సంబంధాలు స్థిరంగా ఉంటాయి.  మీ విజయాన్ని ఎంజాయ్ చేయండి. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 


ధనుస్సు
ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. లాటరీ, జూదానికి దూరంగా ఉండండి. 


Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
మకరం
ఈ రోజు మీరు కోరుకున్న బాధ్యతను పొందడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పనులు చేస్తారు. పూర్వీకుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.


కుంభం 
మీ నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంటారు.  మీ ఎత్తుగడతో మీకు చెడుచేయాలనుకున్నవారికి సమాధానం చెబుతారు.  విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మీ ఆలోచనా విధానం బావుంటుంది. 


మీనం 
సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఈ రోజంతా మీకు మంచిదే. ఎవరికైనా సహాయం చేయడం వల్ల ఆనందం పెరుగుతుంది. భావోద్వేగ క్షణాలు ఉండొచ్చు. పాతమిత్రులను కలుస్తారు. 


Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..