మే 31 మంగళవారం రాశిఫలాలు (Horoscope Today 31 May 2022)


మేషం
మీ ప్రవర్తన పట్ల కొందరు చికాకు పడతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో ఇబ్బంది పడతారు. ఎవరికైనా వాగ్దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు కార్యాలయంలో శుభవార్త వింటారు.


వృషభం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. పని విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపారం పరిధి పెంచుకుంటారు. మీ లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త సబ్జెక్టుల జ్ఞాన సేకరణలో నిమగ్నమై ఉంటారు. స్నేహితులను కలుస్తారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది.


మిథునం
పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబంతో పంచుకోండి.ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం చెడుగా ప్రొజెక్ట్ అవుతుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది.


Also Read: ఈ వారం ఈ మూడు రాశులవారికి డబ్బే డబ్బు, ఆ రాశి డయాబెటిక్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే


కర్కాటకం
పెద్ద బాధ్యతను పూర్తి చేసిన తర్వాత మీరు మంచి అనుభూతి చెందుతారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. పెళ్లికానివారికి సంబంధాలు కుదురుతాయి. పెట్టుబడి ప్రతిపాదనలు అందుకుంటారు. పాత కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించవచ్చు.


సింహం
కుటుంబ సభ్యులతో మంచి సమన్వయం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ పని క్రెడిట్ వేరేవారు తీసుకుంటారు. రెగ్యులర్ వర్క్ పై ప్రభావం పడుతుంది. తలనొప్పితో ఇబ్బందిపడతారు. తొందరపడి ఏ పనీ చేయొద్దు. ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం. 


కన్య
ఈ రోజు మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు.ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఎవరినీ అగౌరవపరచవద్దు. ఈ రోజు బంధువులను కలుస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది. కార్యాలయంలో కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనులు సులువుగా పూర్తవుతాయి.


తులా
స్నేహితులను కలుస్తారు. బీపీ ఎక్కువగా ఉంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కష్టపడి పని చేసినా పూర్తి ప్రయోజనం లభించక పోవడం వల్ల మనసు కాస్త దిగులుగానే ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. 


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు కొత్త పని ప్రారంభించడం లాభిస్తుంది. గత పరిచయాల వల్ల మీ పని పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సన్నిహితులతో ప్రేమ వ్యవహారం మొదలవుతుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. 


ధనుస్సు 
ఈ రోజు ఇంట్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్  చేస్తారు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మీరు మీ భాగస్వామితో కోపంతో మాట్లాడకండి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కళతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి విజయాన్ని పొందుతారు.


మకరం
మీ శక్తి సామర్థ్యం గురించి మీరు గందరగోళానికి గురవుతారు.పెద్దల సూచనలను తప్పకుండా పాటించండి. నిర్లక్ష్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య దూరం పెరుగుతుంది. పాత పరిచయస్తులను కలుస్తారు. 


కుంభం
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఏ పనిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ జీవిత భాగస్వామి నుంచి ఏ విషయాన్ని దాచవద్దు. చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. 


మీనం
రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు మంచి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం పట్ల ఉత్సాహంగా ఉంటారు.పాత మిత్రులను కలుసుకుంటారు. 


Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే