మే 30 సోమవారం నుంచి జూన్ 5 ఆదివారం వరకూ  వార ఫలాలు  (Weekly Horoscope 30 May to 5 June 2022)


మేషం 
ఈ వారం మేష రాశివారికి బాగానే ఉంది. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగస్తులకు పని వాతావరణం చాలా బాగుంటుంది. లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయడం వల్ల  మీ మనోబలం పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపుతారు.  ప్రేమ వివాహానికి కుటుంబసభ్యుల అంగీకారం లభిస్తుంది. మీరు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును అకస్మాత్తుగా పొందవచ్చు. వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో కలహం జరిగే అవకాశం ఉంది.  అనవసర విషయాలపై వాదనపెట్టుకోవద్దు.  
 
వృషభం 
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్లు పొందే అవకాశాలున్నాయి. ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీ అభిరుచికి అనుగుణంగా పని చేయడానికి మీకు అవకాశాలు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో కొత్త అనుభూతి ఉంటుంది. మీరు పనిచేసేరంగంలో గొప్ప విజయాలు ఉంటాయి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. 


మిథునం
ఈ వారం మిథున రాశివారు శుభవార్త వింటారు.  రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందగలరు. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారు. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. వారం చివరిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు.  కొన్నిసార్లు మీరు ఒంటరిగా అనిపించవచ్చు. తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.


కర్కాటకం 
ఈ వారం మీరు చాలా డబ్బు ఖర్చుచేస్తారు. సృజనాత్మక పనిని ఆనందిస్తారు. బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి.   ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. చెప్పుడు మాటలు వద్దు..మీ మనసు చెప్పిన మాటే వినండి.  మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ పని పట్ల ఉన్నతాధికారులు మరియు అధికారులు సంతోషిస్తారు. వారం ప్రారంభంలో పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. కార్యాలయ బాధ్యతలు చాలా కష్టాలతో పూర్తి చేస్తారు.అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. పాత శత్రువులు చురుగ్గా ఉంటారు..మీరు ధైర్యంగా ఉండాలి. 


సింహం
ఈ వారం  విద్యార్థులకు విజయావకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసిన వారు మంచి ఫలితాలు పొందుతారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు అందుతాయి. మీ దినచర్యను మెరుగుపరచుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  కొన్ని పనుల్లో సమస్యల వల్ల కలత చెందుతారు. మీ విజయాలపై సంతృప్తి చెందండి. అప్పులు చేయడం వల్ల మీపై ఒత్తిడి ఉంటుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి.


కన్య
ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిన పనులు పూర్తి చేస్తారు. యువతకు కెరీర్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మీరు కొన్ని బాధ్యతలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. బుధ, శుక్రవారాలు శుభప్రదమైన రోజులు. మీరు మీ కెరీర్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు.  ఈ  వారం పొట్టకు సంబంధించిన సమస్యతో బాధపడతారు.  వ్యాపార సంబంధాల గురించి మీరు భావోద్వేగానికి గురికావొద్దు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.  మీరు కుటుంబ సభ్యుల గురించి చెడుగా అర్థం చేసుకుంటారు. 


తుల 
ఈ వారం తులారాశి నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. ప్రేమ వ్యవహారాలకు చాలా సమయం ఇస్తారు.  వ్యాపారం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది మీ కొత్త పరిచయాలను అభివృద్ధి చేస్తుంది. మీరు వ్యాపారంలో లాభపడతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. ఆర్థిక  లావాదేవీల కారణంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు శారీరకంగా కొద్దిగా బలహీనంగా భావిస్తారు. ప్రయాణంలో మీరు ఇబ్బందులకు గురవుతారు.
 
వృశ్చికం
ఈ వారం వృశ్చిక రాశివారు ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.  పిల్లల ప్రవర్తన నుంచి  ఆనందాన్ని పొందుతారు. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ స్వభావంలో వినయం ఉంటుంది. మీ పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు.  మీ వాయిస్‌ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. వేరేవారి మాటలు నమ్మి మీ ప్రియమైన వారిని అనుమానించకండి. 


ధనుస్సు
ఈ వారం మీకు మంచి వారం.  వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు తయారు చేయొచ్చు.  ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచి సమయం. ప్రభుత్వ పనులను పూర్తి చేస్తారు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు రావొచ్చు. వాహన కొనుగోలు ప్రణాళిక విఫలమయ్యే అవకాశం ఉంది.దంపతులు ఒకరి భావాలను మరొకరు సరిగా అర్థం చేసుకోవాలి. రక్తపోటు రోగులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా శారీరక సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, దానికి సరైన పరిష్కారాన్ని చూసుకోండి..తేలిగ్గా తీసుకోవద్దు. పుకార్లను పట్టించుకోకండి. 


మకరం
ఈ రాశి  వారు  స్నేహితుల నుంచి మంచిమద్దతు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉండే వ్యక్తులకు మంచి రోజు. క్లిష్ట పరిస్థితుల్లో బాగా రాణిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. కెరీర్ ప్రణాళికలు వేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది. మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు.  ప్రేమ సంబంధాల్లో పారదర్శకంగా ఉండండి. వస్తు వనరుల సమీకరణలో ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు-కేసు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 


కుంభం 
ఈ వారం కుంభ రాశివారి ఆర్థిక స్థితి బావుంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.  సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది.  మీ పని తీరు పట్ల అధికారులు సంతోషిస్తారు.ప్రేమికులు తమ భాగస్వామిని ప్రపోజ్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి.ఏ పని చేయడంలోనూ అతిగా ఆలోచించవద్దు. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. 
 
మీనం 
ఈ వారం మీఆదాయం పెరుగుతుంది. లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అనవసర మాటలు, ప్రసంగాలు వద్దు.  ఎవరినీ బాధపెట్టవద్దు. మీ అనుభవాలను ఇతరులు ఉపయోగించుకుంటారు.  ప్రయాణ సమయంలో సహ ప్రయాణీకులతో ఎక్కువగా మాట్లాడకండి. ఖర్చులు పెరుగుతాయి. కోపం మరింత తీవ్రమవుతుంది.