షియోమీ ప్రస్తుతం బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ 10 సిరీస్‌లో రానున్న ఈ ఫోన్‌కు రెడ్‌మీ 10 ప్రైమ్ ప్లస్ 5జీ అనే పేరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబందించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. కాబట్టి దీని లాంచ్ కూడా త్వరలోనే ఉందని అనుకోవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. ఫీచర్లను బట్టి దీని ధర రూ.13 వేలలోపే ఉండనుందని అంచనా వేయవచ్చు


గతంలోనే ఈ ఫోన్ ఇండియన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. 22041219I మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11ఈ అనే స్మార్ట్ ఫోన్‌కు ఇండియన్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అంటే రెండిటి స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉండనున్నాయన్న మాట.


రెడ్‌మీ నోట్ 11ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.


5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!