ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ల సేల్ మళ్లీ లైవ్ అయింది. అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లు అన్నమాట. ఈ కేటగిరీలో ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6, 6ఎస్, 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 7, ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.


దీంతోపాటు రెడ్‌మీ, మోటొరోలా శాంసంగ్, గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ కేటగిరిలో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ రీఫర్బిష్డ్ కేటగిరిలో ఉండే ఫోన్లను చాలా బాగా చెక్ చేస్తుంది. క్వాలిటీ చెకింగ్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది. మొత్తంగా 47 రకాల క్వాలిటీ చెక్స్‌లో పాస్ అయిన ఫోన్లు మాత్రమే సేల్‌లో ఉంటాయి. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్లు ఇవే.


యాపిల్ ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 16 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఇందులో 4.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే. ఇందులో టచ్ ఐడీని అందించారు. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏ9 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 64 జీబీ మోడల్ వేరియంట్ ధర రూ.10,899గా ఉంది. సిల్వర్, స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


యాపిల్ ఐఫోన్ 7
ఈ ఫోన్ ధర రూ.14,529గా ఉంది. దీని ఫీచర్లన్నీ ఐఫోన్ 8 తరహాలోనే ఉంటాయి. కానీ ఏ10 ప్రాసెసర్‌ను అందించారు.


గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్
దీని ధర రూ.13,999గా ఉంది. ఇది 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఇందులో 6.3 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 12.2 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్ వెనకవైపు అందించారు. అలాగే ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


గూగుల్ పిక్సెల్ 3ఏ
ఈ ఫోన్ ధర రూ.10,789గా ఉంది. ఇది కూడా 64 జీబీ మోడలే. ఇందులో 5.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. వెనకవైపు 12.2 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్‌గా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!