మే 30 సోమవారం రాశిఫలాలు (Horoscope Today 30 May 2022)


మేషం
మేష రాశివారికి ఈ రోజు మంచిరోజు. జంటగా సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ప్రమాదకర పనులు చేయడం అస్సలు మంచిది కాదు. కుటుంబానికి పూర్తి సమయం ఇస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు లాభాలొస్తాయి. 
 
వృషభం
ఈ రోజంతా ఈ రాశివారికి  సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు  చదువు, కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త ఆలోచనలను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.


మిథునం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల్లో నష్టాలు సంభవించవచ్చు. కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. నష్టం సంభవించవచ్చు. కొందరికి ఉద్యోగం పట్ల అసంతృప్తి ఉంటుంది. అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. కుటుంబ ఖర్చులు పెరగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.


Also Read: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట


కర్కాటకం
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఇంటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు ఆనందంగా ఉంటారు. బ్యాచిలర్స్ కి ఉత్తమ వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం అవసరం. అధిక శ్రమ వల్ల అలసిపోతారు. 
 
సింహం
కొత్త పనుల పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార భాగస్వాములపై ​​ఏకపక్షంగా ఆధారపడవద్దు. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు రిస్క్ తీసుకుంటారు.  తొందరపాటు వల్ల నష్టపోతారు. ఈరోజు ఓపికతో, సంయమనంతో పని చేస్తే విజయం ఖాయం. మీరు మీ దినచర్యను మార్చుకోవాల్సి ఉంటుంది. 


కన్యా
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. బులియన్ వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయడం ప్రారంభించవచ్చు. ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. మీ ఆలోచన మారవచ్చు. కోపానికి దూరంగా ఉండండి.


తుల
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కెరీర్ విషయంలో ఆందోళన ఉంటుంది. మీ పని నాణ్యతను పెంచుకోండి. మీ సమస్యను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. సంతానం విజయం సాధిస్తుంది.


Also Read:  ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం


వృశ్చికం
బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి సమాచారం అందుతుంది. వ్యాపారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  విద్యార్థులు ఈరోజు చదువుకోవడానికి చాలా సమయం ఇస్తారు. విదేశీ ప్రయాణాల్లో వచ్చే సమస్యలను ఈరోజు అధిగమించే అవకాశం ఉంది. ఒక స్నేహితుడు సహాయం చేస్తాడు. 


ధనుస్సు 
ధనస్సు రాశివారికి ఈ రోజు అనుకూలమైన రోజు.  ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.  కార్యాలయ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు.  వ్యాపారులు లాభం పొందుతారు. చాలా చురుగ్గా ఉంటారు.  మీ సామర్థ్యంతో, మీరు అడ్డంకులను నియంత్రించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. 


మకరం
తలపెట్టిన పనిలో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీరు ఆస్తి సంబంధిత విషయాల నుంచి ప్రయోజనం పొందుతారు. పిల్లల పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆదాయం పెరగొచ్చు. అతిగా మాట్లాడటం వల్ల హాని కలుగుతుంది. ఎవరినీ దుర్భాషలాడవద్దు. 


Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది


కుంభం
మీరు మీ విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. ఎవరైనా మీకు ద్రోహం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రవర్తన పట్ల కొంతమందికి కోపం కూడా రావొచ్చు. కొత్త పనులు ప్రారంభించడంలో తొందరపాటు వద్దు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.


మీనం 
వ్యాపారంలో మంచి ఒప్పందం ఉండొచ్చు.  కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మనసులో ప్రేమను మీ సోల్ మేట్ కి ప్రపోజ్ చేస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. 


Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి