వైశాఖ అమావాస్య మే  30 సోమవారం వచ్చింది. వాస్తవానికి అమావాస్య  మే 20 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 13 నిముషాల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 31 నిముషాల వరకూ ఉంది. సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ సారి శని అమావాస్య, సోమావతి అమావాస్య, వటసావిత్రి వ్రతం ఇవన్నీ మే 30 సోమవారం వచ్చాయి.   ఈ రోజు శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వులు, నలుపు లేదా నీలం వస్త్రం సమర్పించి పూజలు చేసి...ఆ తర్వాత దానధర్మాలు చేస్తే శనిగ్రహ దోషం తగ్గుతుందని చెబుతారు.


అమావాస్య  నియమాలు



  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి...ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్టా దేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది

  • అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రమే..అందుకే తలస్నానం చేయాలి. తలంటుకోరాదు

  • ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు, మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు

  • అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం

  • అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు  వదలితే..ఇంట్లో శుభఫలితాలుంటాయి

  • పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వొచ్చు

  • అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టుకత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు

  • అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు

  • అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది

  • శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు, కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు

  • అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు

  • ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం, లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం


Also Read: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం
అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలాలి. ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు  నైవేద్యం సమర్పించాలి. అనంతరం పెద్దలను స్మరించుకుని ఆవులు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వలన పరమ పవిత్రం అవుతుంది.


Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది