మే 29 ఆదివారం రాశిఫలాలు


మేషం
ఆర్థిక లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.  పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీతీరుని కొందరు అనుమానిస్తారు.  మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కొన్ని పనుల విషయంలో గందరగోళానికి గురవుతారు.


వృషభం
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరీర్‌లో లాభాలు పొందవచ్చు. వ్యాపారాభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవడం మంచిది. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. 


మిథునం
ఇచ్చిన డబ్బు తిరిగి పొందడంలో వివాదాలు జరుగుతాయి. ప్రతికూల వ్యక్తులతో పరిచయం వద్దు. తెలియని వ్యక్తుల వల్ల మీ పని దెబ్బతింటుంది. కుటుంబానికి సమయం ఇవ్వలేరు. ఈ రోజు మీరు శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. తప్పుడు సమాచారం అందుకోవడం వల్ల మనసు కలత చెందుతుంది.


Also Read:  మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది


కర్కాటకం
బులియన్ వ్యాపారులు లాభపడతారు. మీరు మీ పని పట్ల చాలా సీరియస్‌గా ఉంటారు. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఏదో విషయంలో అశాంతిగా అనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.  ప్రేమికులు సంతోషంగా ఉంటారు.
 
సింహం
ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో హడావుడి ఉంటుంది. పొట్టకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబం, స్నేహితులతో టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.  ఆఫీసులో మీ ప్రతిష్ట పెరుగుతుంది.మీ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోండి.  విద్యార్థులు చదువుల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది.


కన్యా
మీరు సామాజికంగా బలంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ పిల్లల ప్రవర్తనతో మీ మనస్సు సంతోషిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడండి. విచారకరమైన వార్తలు వింటారు.  ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


Also Read:  శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు


తులా  
శత్రువు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. గోప్యమైన విషయాలను అందరితో పంచుకోవద్దు. ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. మనసులో భయం ఉంటుంది. కార్యాలయంలో గౌరవం , ఆనందం ఉంటాయి.  అజాగ్రత్త కారణంగా మీ పని చెడిపోతుంది. జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. 


వృశ్చికం
స్నేహితులతో పార్టీల్లో పాల్గొంటారు.  మాజీ ప్రియురాలిని కలుస్తారు. తెలియని ప్రతిబంధకం వల్ల పనులు ప్రభావితం కావొచ్చు. దాంపత్య సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. మీ వ్యాపార స్థితిని బలోపేతం చేసుకోండి. కార్యాలయంలో మీ అధికారం, కీర్తి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది.  


ధనుస్సు 
మీకు విధేయత చూపమని ఎవరినీ బలవంతం చేయవద్దు. మీకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఏ విషయంలోనైనా మధ్యవర్తిత్వం వహించండి. గౌరవ లోపం ఉంటుంది. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయవద్దు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ పనులను అసంపూర్తిగా వదిలేయకండి.


మకరం
ధార్మిక పనుల పట్ల అధిక ఆసక్తిని కనబరుస్తారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించండి. వ్యాపారంలో కొంత నష్టపోయే అవకాశం ఉంది. మీ సహాయక సిబ్బందిపై ఎక్కువ నమ్మకం ఉంచవద్దు. ఎవరైనా మీకు హాని చేయవచ్చు. ఇంటి సభ్యుల మధ్య మంచి సమన్వయాన్ని కొనసాగించండి.


Also Read:  మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం


కుంభం 
తెలియని వ్యక్తిని వెంటనే నమ్మవద్దు. మీరు మీ స్నేహితులతో సమయం స్పెండ్ చేస్తారు.  ఎవరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు అనవసరమైన పనులకు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉంటుంది.  పెద్దల అనుభవాల వల్ల ప్రయోజనం పొందుతారు. 
 
మీనం
మీరు ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో ఏదైనా ఈవెంట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారాలు కొత్త భాగస్వాములను చేర్చుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. యువకుల వృత్తిలో పురోగతి ఉంటుంది. ఎవరైనా మీ పట్ల అసూయ భావాలను కలిగి ఉంటారు. ఎవరికీ హాని చేయవద్దు.