మీనం నుంచి మేష రాశిలోకి మారుతున్న శుక్రుడు
ఒకరాశి నుంచి మరో రాశిలోకి గ్రహాల సంచారం ఒక్కో రాశిపై ఒక్కో ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం తొమ్మిది గ్రహాలు నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఇదే కోవలో ప్రస్తుతం మీనంలో ఉన్న శుక్రుడు మేషరాశిలోకి రానున్నాడు. శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, శృంగారం విషయాలకు సంబంధించిన వాటికి కారకమైన గ్రహంగా పరిగణిస్తారు. మే 23 సోమవారం రాత్రి 8 గంటల 39 నిముషాలకు మీనం నుంచి మేషంలోకి ప్రవేశిస్తుంది శుక్రగ్రహం. ఈ ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం
మేషరాశి
శుక్రుడి సంచారం మేష రాశివారికి బాగా కలిసొస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది, వివాహితులు సంతోషంగా ఉంటారు. ప్రేమికుల మధ్య సమస్యలు తొలగి పెళ్లిదిశగా అడుగులేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్త వహించండి. బంధువులతో సంబంధాలు బలంగా ఉంటాయి.
మిథున రాశి
మేషరాశిలో శుక్రుని సంచార సమయంలో మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది.
Also Read: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
కర్కాటక రాశి
శుక్రసంచారం వల్ల కర్కాటకరాశివారి జీవితంలో చాలా మంచి మార్పులుంటాయి. ఉద్యోగంలో విజయం, గౌరవం లభిస్తుంది. పితృ ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేసేందుకు శుభసమయం. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. మీరు శుభవార్త వింటారు.
సింహ రాశి
సింహరాశి వారికి మేషరాశిలో శుక్రుని సంచారం మంచిది. ధైర్యం శక్తి పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఎవరికీ సలహా ఇవ్వకండి.
తులా రాశి
తులారాశి వారికి శుక్రుడి రాశి మార్పు అద్బుతంగా ఉంది. కుటుంబానికి సంబంధించి చాలా పనులు పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు సక్సెస్ అవుతారు. ధనలాభం ఉంటుంది.
ధనుస్సు
శుక్రుడు రాశి మార్పు ధనస్సు రాశివారికి అదృష్టాన్ని తెస్తోంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి