లెక్సర్ మనదేశంలో కొత్త ఎన్ఎం760 ఎన్వీఎంఈ ఎస్ఎస్‌డీని లాంచ్ చేసింది. గేమర్లు, ఫిల్మ్ మేకర్ల కెసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం రూపొందించారు. 5.3 జీబీపీఎస్ రీడ్ స్పీడ్, 4.5 జీబీపీఎస్ రైట్ స్పీడ్‌ను ఇది అందించనుంది. ఇది చాలా ప్లాట్‌ఫాంలను సపోర్ట్ చేయనుంది.


ఇది రెండు స్టోరేజ్ కెపాసిటీల్లో అందుబాటులో ఉండనుంది. వీటిలో 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్ ధర రూ.10,000గా ఉంది. 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియరాలేదు. దీనిపై ఐదు సంవత్సరాల వారంటీని కూడా అందించనున్నారు. దీనికి సంబంధించిన సేల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


లెక్సర్ ఎన్ఎం760 ఎన్‌వీఎంఈ ఎస్ఎస్‌డీ స్పెసిఫికేషన్లు
లెక్సర్ ఎన్ఎం760 ఎన్‌వీఎంఈ ఎస్ఎస్‌డీ 5.3 జీబీపీఎస్ రీడ్ స్పీడ్‌ను, 4.5 జీబీపీఎస్ రైట్ స్పీడ్‌ను అందించనుంది. సాటా (SATA) బేస్డ్ ఎస్ఎస్‌డీల కంటే ఇది 9.6 రెట్లు వేగంగా పని చేస్తుందని తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, ప్లేస్టేషన్ 5 గేమింగ్ కన్సోల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


దీన్ని 12ఎన్ఎం కంట్రోలర్ ద్వారా రూపొందించారు. గతంలో ఉన్న 28ఎన్ఎం ప్రాసెస్ కంటే తక్కువ పవర్‌ను ఇది ఉపయోగించుకోనుంది. పీసీఐఈ జెన్4x4 ఎన్వీఎంఈ 1.4 టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. వేగవంతమైన ట్రాన్స్‌ఫర్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. పీసీఐ3 జెన్3 సిస్టమ్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. గేమర్స్, కంట్రోలర్స్ తమ పాత సిస్టంల ద్వారా కూడా దీన్ని ఉపయోగించవచ్చు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!