మీనం నుంచి మేష రాశిలోకి మారుతున్న శుక్రుడు


మే 23 సోమవారం రాత్రి 8 గంటల 39 నిముషాలకు మీనం నుంచి మేషంలోకి ప్రవేశిస్తుంది శుక్రగ్రహం. ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభఫలితాన్నిస్తే మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాన్నిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఓ మూడు రాశులకు మినహా శుక్రుడి సంచారం మిగిలిన అన్ని రాశులకు అనుకూల ఫలితాన్నే ఇస్తోందని చెప్పుకోవాలి...


వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుని రాశి మార్పు ప్రభావం సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగ, వ్యాపార ప్రయాణాలు కలిసొస్తాయి కానీ తగిన జాగ్రత్తలు తప్పనిసరి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.


కన్యా రాశి
శుక్రుని సంచారం కన్యా రాశివారికి మిశ్రమ ఫలితాన్నిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, మరికొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలెక్కువ. పూర్వీకుల ఆస్తుల విషయంలో లావాదేవీలు ఇప్పుడు జరపకపోవడమే మంచిది. ఎవ్వరికీ అప్పులివ్వకండి.వివాదాలకు దూరంగా ఉండండి.  మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేస్తారు. 


Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి


వృశ్చిక రాశి
శుక్రుడి రాశి మార్పు ప్రభావం వృశ్చికరాశి వారిపై ప్రతికూలంగా ఉంటుంది. అప్పులు తీసుకోవద్దు.ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు. ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కార్యాలయంలో కొన్ని వివాదాలుంటాయి జాగ్రత్త. 


మకరం
మకర రాశి వారికి శుక్రుడు రాశి మారడం వల్ల శుభవార్తలు అందుతాయి.మిత్రులతో వివాదాలు సమసిపోతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. లావాదేవీకి సంబంధించిన సమస్య పరిష్కరిస్తారు. భూమి కొనుక్కోవచ్చు. మీ ప్రణాళికలను బయటకు చెప్పకండి. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.


కుంభ రాశి
శుక్రుని రాశి మార్పు కుంభ రాశివారికి బావుంటుంది. కఠినమైన సవాళ్లను ఎదుర్కోగలుగుతారు.ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుపేదలకు సహాయం చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్త వింటారు. అవివాహితులకు పెళ్లవుతుంది. 


Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!


మీన రాశి
మీన రాశి వారికి శుక్రగ్రహం మార్పు సానుకూలంగా ఉంటుంది. నిలిపివేసిన మొత్తం తిరిగి అందుతుంది.  కుటుంబంతో గరిష్ట సమయం గడుపుతారు. మీరు పెద్ద బాధ్యతను పొందుతారు. తల్లిదండ్రుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త మానుకోవాలి.


Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా