సంజన గల్రాని సినిమాల్లో తెచ్చుకున్న పేరు కన్నా వివాదాస్పద అంశాల్లోనే ఎక్కువగా పేరు వినిపించింది. గత ఏడాదంతా డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. ఆ తరువాత పూర్తి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. గర్భం ధరించడంతో ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంది.ఈ రోజు ఉదయం బెంగళూరుఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురుడు పోసిన వైద్యురాలు ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రాని పెళ్లి మే 18న ఆది పినిశెట్టితో జరిగిన విషయం తెలిసిందే.  ఆ పెళ్లిలో సంజన కనిపించలేదు. దానికి కారణం ఆమె ఆసుపత్రిలో ఉండడమే. 


సంజన గతేడాది డ్రగ్స్ కేసులో ఇరుక్కుని మూడు నెలల పాటూ జైలుకెళ్లి వచ్చింది. అంతకు ముందే మే 2020లో ఆమె తన చిన్నప్పటి స్నేహితులు అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది. అతను చాలా కాలం నాటి నుంచి తెలుసని చెప్పింది సంజన. ఈ పెళ్లి కేవలం బంధు మిత్రుల మధ్యే జరిగింది. అజీజ్ పాషా ఒక వైద్యుడు.ఆమె ప్రెగ్నెన్సీకి ముందు 18 కిలోల బరువు పెరగడం, వెన్ను నొప్పితో బాధపడింది. ఆ సమస్యల నుంచి బయటపడ్డాక గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితమే ఆమెకు సీమంతం కూడా జరిగింది. భర్త ముస్లిం కావడంతో రెండు సాంప్రదాయాల్లో సీమంతాన్ని నిర్వహించారు.